రజినీకాంత్ తర్వాత అతనే..

Update: 2016-10-04 17:30 GMT
శివ కార్తికేయన్.. విజయ్ టీవీలో ఒకప్పుడు యాంకర్. ధనుష్ పుణ్యమా అని అతడి సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు సంపాదించాడు. ఆ తర్వాత హీరో అవతారమెత్తాడు. 1.. 2.. 3.. ఏడాదిన్నర వ్యవధిలో హ్యాట్రిక్ హిట్లతో ఒక్కసారిగా రైజ్ అయ్యాడు. మాన్ కరాటె (తెలుగులో తుంటరి) సినిమాతో స్టార్ అయిపోయాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అతడి సినిమా ‘రజినీ మురుగన్’ ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది. శివకార్తికేయన్ కొత్త సినిమా ‘రెమో’ దసరా కానుకగా విడుదలవుతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తమిళంలో స్టార్ హీరోల సినిమాలు ఎలా రిలీజవుతాయో.. ఇది కూడా అలాగే విడుదలవుతోంది.

విశేషం ఏంటంటే.. తమిళనాట మాత్రమే కాదు శివకార్తికేయన్ కు విదేశాల్లో సైతం ఫాలోయింగ్ పెరిగింది. తమిళ సినిమాలు రెగ్యులర్ గా విడుదలయ్యే దేశాలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు పెద్ద ఎత్తున రిలీజయ్యే జపాన్ దేశంలో కూడా ‘రెమో’ సందడి చేయబోతోంది. జపాన్ లో ‘రెమో’ను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. రజినీ కాకుండా మిగతా తమిళ హీరోల సినిమాలు టోక్యో.. యొకోయమ ప్రాంతాల్లో మాత్రమే ప్రదర్శితమవుతాయి. ఐతే ‘రెమో’.. రజినీ సినిమాలు మాత్రమే విడదులయ్యే నగోయాలో కూడా విడుదలవుతోంది. మెడ్రాస్ మూవీస్ సంస్థ భారీ మొత్తానికే ‘రెమో’ హక్కుల్ని కొని జపాన్ లో రిలీజ్ చేస్తోంది. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ‘రెమో’లో శివకార్తికేయన్ సరసన లక్కీ గర్ల్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News