కోలీవుడ్ స్టార్లు తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బిచ్చగాడుతో విజయ్ యాంటోనీ కొట్టిన హిట్.. సాధించిన కలెక్షన్స్ చూశాక మరికొందరు తమిళ హీరోలు కూడా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో కమెడియన్ నుంచి స్టార్ గా ఎదిగిన శివకార్తికేయన్ కూడా ఉన్నాడు. దసరాకి రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన కామెడీ మూవీ రెమోను అదే పేరుతో తెలుగులోకి కూడా తీసుకొచ్చారు.
దిల్ రాజు బ్యానర్ పై తెలుగు వెర్షన్ రావడం.. భారీగానే ప్రమోషన్స్ చేయడం.. చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు కేటాయించడం.. అన్నిటికీ మించి తెలుగులో సూపర్ స్పీడ్ లో దూసుకుపోతున్న కీర్తి సురేష్ కావడంతో.. మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫుల్ ప్లెడ్జెడ్ కామెడీ చిత్రం కావడంతో.. హిట్ పక్కా అనుకున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి తేడా వచ్చేసింది.
రెమో తెలుగు వెర్షన్ కి కేవలం పబ్లిసిటీ కోసమే 2.5 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. అయితే.. గతవారం వచ్చిన తెలుగు రెమో.. కనీసం ఈ మొత్తం కూడా వసూలు చేయకపోవచ్చని ట్రేడ్ జనాలు అంటున్నారు. శివకార్తికేయన్ కి కీర్తి సురేష్ హిట్ ఇస్తుంది అనుకుంటే.. నేను-శైలజతో దూసుకుపోతున్న ఈ భామకే ఫ్లాప్ పడింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/