రేణు రోజుకు 18 గంటలు కరోనా రోగుల సహాయార్థం

Update: 2021-05-22 04:31 GMT
కరోనాతో పోరాటం చేస్తున్న ఎంతో మంది సమయానికి ఆక్సీజన్‌ అందక.. మెడిసిన్స్ అందక.. ఆసుపత్రి బెడ్స్ ఖాళీ లేకపోవడంతో చనిపోతున్నారు. సమయానికి వారికి చికిత్స అందిస్తే బతికే అవకాశం ఉన్నా కూడా ఎక్కడ ఆక్సీజన్‌ నిల్వ ఉంది.. ఎక్కడ మెడిసిన్‌ లభిస్తుంది.. ఎక్కడ బెడ్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాలు తెలియకన చనిపోతున్న వారు కొందరు ఉన్నారు. వారి కోసం అంటూ కొందరు సినీ రంగానికి చెందిన వారు సోషల్‌ మీడియా ద్వారా సహాయం గా నిలుస్తున్నారు. అందులో రేణు దేశాయ్‌ ఒకరు. ఆమె కేవలం సమాచారం ను షేర్‌ చేస్తూ ఎంతో మందికి సాయంగా నిలుస్తున్నారు.

ఏ అవసరం ఉన్నా కూడా తనకు కాల్‌ చేయాలంటూ రేణు దేశాయ్‌ హెల్ప్‌ లైన్ ను ఓపెన్‌ చేశారు. ఆ నెంబర్‌ కు రోజుకు వందల సంఖ్యలో కాల్స్ మరియు మెసేజస్ వస్తున్నాయట. వాటన్నింటిని కూడా సావదానంగా రేణు దేశాయ్‌ పరిశీలించి ఎవరికి అవసరం అయిన సాయంను ఆమె టీమ్‌ ద్వారా చేస్తోంది. ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఆమె ను ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఎవరికి ఏదైనా అవసరం అని మెసేజ్‌ వచ్చిన వెంటనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది. అలా అడ్రస్‌ కు దగ్గరగా ఉన్న వారు వెళ్లి సాయం చేడయం లేదంటే మరో విధంగా సాయం అందించేలా చూడటం చేస్తున్నారట.

ఇలా రోజుకు రేణు దేశాయ్‌ 18 గంటలకు పైగా పని చేస్తుందట. సమాచారాన్ని షేర్‌ చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి సాయంగా రేణు దేశాయ్ నిలుస్తున్నారు. ఈ విషయంలో తనకు చాలా మంది దాతలు సహాయంగా నిలుస్తున్నారంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ప్రతి రోజు ఒక్కరికి అయినా సహాయం చేయగలిగితే చాలా ఆనందంగా ఉంటుందని రేణు చెప్పుకొచ్చింది. నేను చేస్తున్న సాయం జస్ట్‌ ఫోన్‌ లో సమాచారంను షేర్‌ చేసుకోవడం. ఇది ఎలాంటి సాయమో నాకు తెలియదు. కాని చాలా మందికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు.
Tags:    

Similar News