హెయిర్‌ డొనేషన్‌ అంటోంది ఈవిడ

Update: 2015-09-25 07:18 GMT
మెగాస్టార్ చిరంజీవి బ్ల‌డ్‌ బ్యాంక్‌ - ఐబ్యాంక్  ప్రారంభించి అవ‌స‌రార్థుల‌ను ఆదుకుంటున్నారు. ఎమ‌ర్జెన్సీలో ర‌క్తం అవ‌స‌రం అయిన‌వాళ్ల‌కు చిరంజీవి బ్ల‌డ్‌ బ్యాంక్ ఎంతో ఉప‌క‌రిస్తోంది. క‌ళ్లు లేని వారి కోసం దాత‌ల నుంచి క‌ళ్ల‌ను సేక‌రించి వాటిని అవ‌స‌రార్థుల‌కు అంద‌జేస్తున్నారు. ఇదంతా  ప్ర‌జ‌ల శ్రేయ‌స్సును ఉద్ధేశించి చేస్తున్న మంచి కార్యాలు. అదే బాట‌లో త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల కోసం తాను చేయాల్సిన మంచి ప‌నుల్ని చేస్తూనే ఉన్నారు. క‌ష్టాల్లో ఉన్న వారిని క‌లుసుకుని ఆర్థిక సాయం చేసే అల‌వాటు ప‌వ‌న్‌ కి ఉంది.

ఇప్పుడు అదే వార‌స‌త్వాన్ని ప‌వ‌న్ ఎక్స్ వైఫ్ రేణుదేశాయ్ కొన‌సాగిస్తున్నారు. అయితే పెద్ద స్థాయి సేవా కార్య‌క్ర‌మం కాక‌పోయినా త‌న‌వంతుగా ఓ చిరు సాయానికి రేణు ముందుకొచ్చారు. క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర మ‌హ‌మ్మారీకి బ‌లైపోతున్న అభాగ్యులెంద‌రో. అలాంటి వారికి క్యాన్స‌ర్ ప్రారంభ ద‌శ నుంచే త‌ల నీలాలు ఊడిపోతాయి. హెయిర్ రాలి ప‌డిపోతుంది. దీనివ‌ల్ల రోగిలో ఆత్మ‌న్యూన‌త పెరుగుతుంది. రోగి చ‌నిపోయే స్టేజికి వ‌చ్చేప్ప‌టికి పూర్తిగా బాల్డ్ హెడ్ త‌యార‌వుతుంది. అలాంటివాళ్లు ట్రీట్‌ మెంట్ కొన‌సాగుతున్న టైమ్‌ లో తిరిగి జుత్తును పొందాల‌నుకున్నా రావ‌డం క‌ష్టం. ఒక‌వేళ కృత్రిమంగా త‌యారు చేయించాలంటే అలాంటివాటికి క‌నీసం70 వేల రూపాయ‌ల్ని ఖ‌ర్చు చేయాలి.

అలా ఖ‌ర్చు చేయ‌గ‌లిగేవారెందరు? అలాంటి పేద‌ల్ని - క్యాన్స‌ర్ రోగుల‌కు త‌న త‌ల‌నీలాల్ని ఇచ్చేస్తాన‌ని రేణు చెబుతున్నారు. రేణుదేశాయ్  పొడ‌వైన త‌ల‌నీలాల్ని క‌లిగి ఉన్న హీరోయిన్‌ గా పాపుల‌ర్‌. వ‌య‌సు 40 దాటాక నా త‌ల వెంట్రుక‌ల్ని క‌ట్ చేసి, అవ‌స‌రార్థుల‌కు ఇచ్చేయాల‌నుకుంటున్నా.. అని చెప్పారు. అలాంటి పొడ‌వైన జ‌డ‌ను సంపాదించాలంటే నాలుగేళ్లు వేచి చూస్తే కానీ తిరిగి అంత ఎద‌గ‌దు. రేణు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డెసిష‌న్‌ కి అంద‌రూ మెచ్చుకోవాల్సిందే.
Tags:    

Similar News