పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పిల్లల విషయంలోనో లేక.. ఏదైనా ఇష్యూపై నిర్మొహమాటంగా తన అభిప్రాయలు వ్యక్తం చేసో ఆమె వార్తలలో వ్యక్తి అవుతారు. రేణు రీసెంట్ గా ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' టీవీషో కు అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.
ఒకవైపు పవన్ ఎక్స్ వైఫ్ గెస్ట్.. మరోవైపు పవన్ కు సన్నిహితుడిగా ఉంటూ ఈమధ్యే పవన్ పై విమర్శలు సంధించిన అలీ హోస్ట్ కావడంతో ఈ కార్యక్రమంపై భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది. రెండు నిముషాలకంటే తక్కువగా ఉండే ఈ ప్రోమోలో వివాదాస్పదం అయ్యే అంశాలేవీ లేవు కానీ ఇంట్రెస్టింగ్ టాపిక్ లపై మాట్లాడారు. "మీకు 'రేణు' అనే పేరు ఇష్టం లేదని విన్నాను.. అలా ఎందుకు?" అని అలీ ప్రశ్నిస్తే "అవును. నాకు రేణు అనే పేరు ఇష్టం లేదు. రేవతి లేదా రేవ అనే పేరు నాకు పెట్టి ఉంటే బాగుండేది. కానీ ఏం చేస్తాం" అని నిట్టూర్చారు రేణు. "మీరు పుట్టినపుడు మీ నాన్నగారు హాస్పిటల్ కు రాలేదంట కదా? ఎందుకు?" అని అలీ ప్రశ్నిస్తే "అవును... అమ్మాయి పుట్టిందనే కోపంతో మా నాన్న రాలేదు. కానీ నేను చాలా లక్కీ ఉమన్.. ఎందుకంటే నాకు ఆద్య లాంటి కూతురు ఉంది. ఆద్య లేకుండా నేను ఉండలేను. చచ్చిపోతానేమో'' అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.
"మీరు అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే ఎడిటర్ కదా?" అని అడిగితే "నేను జానీ.. ఖుషి సినిమాలకు ఎడిటర్‌గా పని చేశాను. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎస్.జె సూర్య గారు..రత్నంగారు..మా ఎక్స్ హస్బెండ్ కళ్యాణ్ గారే అందుకు సాక్ష్యం" అని సమాధానమిచ్చారు.
ప్రోమో అంతా సీరియస్ గా ఏమీ సాగలేదు. 'జానీ' షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్న అలీ "మనం జానీ షూటింగ్ ముంబైలో చేసే సమయంలో ఒకరోజు సాయంత్రం మన ముగ్గురం పానీ పూరి తిన్నాం. నువ్వు పానీ పూరి బండి అబ్బాయితో మరాఠీలో మాట్లాడావు. మాకు అర్థం కాక అలా చూస్తుండిపోయాం" అంటూ ఎన్న పరంద ఎన్న చాట టైపులో ఒక డైలాగ్ చెప్పడంతో రేణు పకపకమని నవ్వేశారు.
Full View