రేణు దేశాయ్ అన్న వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గుర్తుకు వస్తారు. ఇద్దరు విడిపోయి చాలాకాలమే అయినా.. వీరిద్దరికి సంబంధించిన విషయాల మీద ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు ఇవ్వటానికి ఏ మాత్రం ఇష్టపడని వ్యక్తి పవన్ అయితే.. ఆయన మాజీ భార్యగా రేణుదేశాయ్ మాత్రం తరచూ ప్రత్యేక ఇంటర్వ్యూలలో కనిపిస్తుంటారు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేతకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా తనే సందర్భంలో రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానన్న విషయాన్ని వివరంగా చెప్పిన ఆమె.. ఈసారి ఎలాంటి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది.. జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్న విషయాల్ని ఆమె వెల్లడించారు.
అనారోగ్యానికి గురైనప్పుడు.. తనకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుందని తాను ఫీలయ్యానని.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని పలువురు కౌన్సిలర్లతో మాట్లాడి.. పెళ్లికి సిద్ధమన్న మాటను ఇంట్లో వాళ్లకు చెప్పినట్లుగా రేణు వెల్లడించారు. తన నోటి నుంచి పెళ్లికి ఓకే అని చెప్పటంతో ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీ అయిపోయారని.. ఇప్పటికే మూడు సంబంధాలు చూసినట్లుగా పేర్కొన్నారు. మూడు సంబంధాల్లో ఒక వ్యక్తిని కలిశానని.. అది చాలా ఫార్మల్ మీటింగ్ అని పేర్కొన్నారు.
ఈసారి తాను లవ్ మ్యారేజ్ చేసుకోనని.. పెద్దలు కుదర్చిన పెళ్లినే చేసుకుంటానని చెప్పారు. ఇక.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని చేసుకోనని వెల్లడించారు. పిల్లలు పెద్దవాళ్లు అయిపోతున్నారని.. ఈ సమయంలో తాను సెటిల్డ్ గా ఉండాలని అనుకుంటున్నానని.. లైఫ్ కామ్ గా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హీరోలు.. రాజకీయ నాయకుల చాలా టెన్షన్ లైఫ్ అని.. అందుకే కూల్ గా.. కామ్ గా ఉండేలా కాబోయే భర్త ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
తన పెళ్లికి పవన్ ఇమేజ్ అడ్డు వస్తుందన్న అభిప్రాయాన్ని చెప్పారు. కోట్లాది మందిన దేవుడిగా ఆరాధించే వ్యక్తి మాజీ భార్య అన్న ట్యాగ్ లైన్ తో పాటు.. అభిమానుల నుంచి వచ్చే ఇబ్బందుల్ని తాను పెళ్లి చేసుకునే వ్యక్తికి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తాను పెళ్లికి సిద్ధమేనన్న మాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత.. ఒక వ్యక్తి స్పందిస్తూ.. ముక్కలు ముక్కలుగా నరికేస్తానని వ్యాఖ్య చేయటాన్ని ప్రస్తావించారు. ఇలాంటి ఇబ్బందులు పెళ్లి తర్వాత ఏడాది వరకూ ఉంటాయని.. ఆ విషయాల్ని కాబోయే భర్తకు చెప్పాలనుకుంటున్నట్లు చెప్పారు.
గుట్టుగా.. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోనని.. పెళ్లి తర్వాత పూలదండతో తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో కలిసి ఉన్న మంచి ఫోటోను తప్పనిసరిగా పోస్ట్ పెడతానని రేణు వెల్లడించారు.
తనను చేసుకునే వ్యక్తి మంచి మనసు ఉండాలని.. తనను.. తన పిల్లల్ని బాగా చూసుకోవాలన్న ఆలోచనను రేణు వెల్లడించారు. తనను పెళ్లి చేసుకునే వ్యక్తికి పవన్ కల్యాణ్ మాజీ సతీమణి అనే బ్యాగేజ్ ఉందని.. దాని కారణంగా తనకు ఎప్పటికీ పెళ్లి కాదేమోనని అనిపిస్తుందన్న భయాన్ని వ్యక్తం చేశారు.
తనను పెళ్లి చేసుకోవాలని చెప్పే వారిలో తన కొడుకు అకీరా కూడా ఉన్నట్లు రేణు వెల్లడించారు. మీరు.. పవన్ కల్యాణ్ ఎందుకు విడిపోయారన్న మాట పిల్లల నుంచి ఎప్పుడైనా వచ్చిందా? మీరు కలిసి ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా వచ్చిందా? అన్న మాటకు బదులిస్తూ.. ఎప్పుడూ అలాంటి మాటలు రాలేదని.. పిల్లలు ఇద్దరూ చాలా మెచ్యూర్డ్ అని చెప్పారు. తండ్రితో కలిసినప్పుడు అకీరా ఏమైనా అడిగాడో తనకు తెలీదని.. ఎప్పుడూ ఆ విషయం గురించి తనకు చెప్పలేదన్నారు.