అందులో అన్నీ దొరకవ్: రేణుదేశాయ్

Update: 2015-10-08 19:30 GMT
ఈ మధ్య రేణుదేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటోంది. తనకు ఏది అనిపించినా వెంటనే పోస్ట్ చేసేస్తుంది. ఇప్పటికే చాలా సార్లు.. తన వైవాహిక జీవితం గురించి గానీ.. పవన్ తో తన రిలేషన్ గురించి గానీ.. చాలా ట్వీట్ లే చేసింది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. అదేంటంటే స్కూల్లో చిన్న పిల్లలకు టీచర్లు ఏమి నేర్పించాలనే విషయం గురించి.

ప్రతి చిన్న విషయానికీ గూగుల్ పై ఆధారపడటం అలవాటైపోయింది. కనీసం ఇంట్లో టీ కాచుకోవాలన్నా... యూట్యూబ్ ఆన్ చేసి టీ ఎలా కాయాలో నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లలకైతే స్కూల్లో గానీ.. ఇంట్లో గానీ.. రైమింగ్స్ చెప్పడం ఎప్పుడో మానేశారు టీచర్లు... తల్లిదండ్రులు. యూ ట్యూబ్ లో రైమింగ్స్ ఆన్ చేస్తే వేలకొద్ది రైమ్స్ అందుబాటులో వున్నాయి. ఇలా గూగుల్ లో చిన్న పిల్లలకు అందుబాటులో వుండే అంశాలపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ స్పందిస్తూ 'ఈ రోజుల్లో ఏం కావాలన్నా.. ఏదైనా అనుమానం వచ్చినా మొదట చేసే పని నెట్ ఆన్ చేసి గూగుల్ తల్లిని అడగటం. అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఇంట్లో అమ్మను, స్కూల్లో టీచర్లను అడగటం ఎప్పుడో మానేశారు పిల్లలు. ప్రతి చిన్న విషయానికి గూగుల్ తల్లి మీదే ఆధారపడుతున్నారు. అయితే గూగుల్ తల్లి కొన్ని అనుమానాలను మాత్రమే నివృత్తిచేస్తుంది.. కొన్నింటిని మాత్రమే నేర్పుతుంది. మిగిలినవన్నీ తల్లి వద్ద.. స్కూల్లో టీచర్ల వద్దనే నేర్చుకోవాలి  అంటోంది' రేణుదేశాయ్. ఇంతకూ గూగుల్ తల్లి వద్ద ఏమి నేర్చుకోవచ్చు అంటే.. పిల్లలకు అవసరమైన జువాలజీ - జామెట్రీ పాఠాలు నేర్చుకోవచ్చు. అయితే టీచర్చు మాత్రం వీటికి బదులుగా స్కూల్లో మంచి సుగుణాలైన జాలీ - కరుణ - సహనం లాంటివి బోధిస్తే సరిపోతుందని చెబుతోంది. పుస్తకాల్లో పాఠాలు గూగుల్ లో సెర్చ్ చేస్తే.. దొరుకుతాయి... అదే ఇలాంటి నైతిక విలువల గురించి కేవలం టీచర్ల వద్ద మాత్రమే నేర్చుకుంటారంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
Tags:    

Similar News