రజినీ సినిమా తర్వాత.. అమ్మ సినిమా

Update: 2016-12-13 10:35 GMT
ఆ మధ్య ఫైజల్ సైఫ్ అనే ఓ దర్శకుడు ‘మై హూ రజినీకాంత్’ అనే సినిమా ఒకటి తీయడం గుర్తుండే ఉంటుంది. ఈ టైటిల్ పెట్టి సినిమా తీయడం అప్పట్లో పెద్ద వివాదం అయింది. ఈ సినిమా టైటిల్లో తన పేరు తొలగించాలంటూ రజినీకాంత్ కోర్టుకు కూడా వెళ్లాడు. ఆ వివాదం ఎలా ముగిసిందో.. ఆ సినిమా ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు అదే దర్శకుడు మరో వివాదాస్పద సినిమాతో రెడీ అవుతున్నాడు. అతను దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘అమ్మ’ అనే సినిమా తీస్తుండటం విశేషం. కన్నడ కథానాయిక రాగిణి ద్వివేది ఇందులో జయలలిత పాత్ర పోషిస్తోంది.

తమిళం.. కన్నడ.. తెలుగు.. మలయాళ భాషల్లో ‘అమ్మ’ సినిమా తెరకెక్కుతోంది. జయలలిత జీవించి ఉండగానే ఈ సినిమా మొదలైంది. దాదాపుగా సినిమా పూర్తయిన దశలో అమ్మ చనిపోయింది. ఇప్పుడు స్క్రిప్టులో ఆ మేరకు మార్పలు చేస్తున్నారు. జయలలిత అంతిమ సంస్కారానికి సంబంధించిన దృశ్యాల్ని కూడా ఇందులో వాడుకోబోతున్నారు. జయలలిత కాలం చేసిన నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొని ఉంది. ఇది ‘అమ్మ’ సినిమాకు బాగా కలిసొచ్చే అంశమే. జనాల్లో ప్రస్తుతం ఉన్న ఎమోషన్ ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News