ఏదన్నా పెద్ద హీరో సినిమాకు రీ-షూట్ అయ్యిందంటే చాలు.. సినిమా అవుట్పుట్ సరిగ్గా రాలేదని.. అందుకే రీషూట్లు చేస్తున్నారని.. హీరో హ్యాపీగా లేడని.. ఇలాంటి చాలా రూమర్లు బయటకు వచ్చేస్తుంటాయి. అయితే ఈ ''రీ షూట్'' అనే ప్రక్రియ అంత పెద్ద తప్పా? నిజానికి ఆ పదం గురించి అలా ఆలోచించడం మానేయమంటూ మీడియాలోని కొందరికి ఇన్ డైరెక్టుగా క్లాసు పీకాడు దర్శకుడు కొరటాల శివ.
''అసలు రీషూట్ చేయడం అంటే తప్పేం కాదే. రీషూట్ అనే పదం అంత బ్యాడ్ వర్డ్ కూడా కాదు. ఏ సినిమా కోసమైనా రీషూట్ చేస్తున్నారంటే అది మంచిదే. ఏదో ఒక రాంగ్ ను సరిచేయడానికి.. లేదంటే మరింత బాగా చూపించడానికో.. ఒక్కోసారి రీషూట్ చేయాల్సి రావొచ్చు. దాని వలన సినిమా చూసేవారు హ్యాపీగా ఫీలవుతారు. పైగా రిజల్టు బాగా వచ్చే ఛాన్సుంటుంది. నా సినిమాలే కాదు.. ఏ డైరక్టర్ అయినా ఏ సినిమానైనా రీషూట్ చేస్తున్నారంటే అది మంచి విషయమే'' అంటూ సెలవిచ్చాడు కొరటాల శివ. ఈ దెబ్బతో మరి రీషూట్ ను బ్యాడ్ గా చూస్తున్న చాలామందికి ఒక క్లారిటీ వచ్చేయాలి.
ఇకపోతే జనతా గ్యారేజ్ కోసం ఎలాంటి రీషూట్లు చేయలేదట. కాకపోతే 10 రోజుల పాటు షూటింగ్ పెండింగ్ ఉందంతే.