ఇండియాలో ఓ కొత్త డైరెక్టర్‌ను నమ్మి 30 కోట్ల బడ్జెట్ పెట్టినా గొప్ప విషయమే. కానీ ఇక్కడో కొత్త డైరెక్టర్ ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయాలనుకుంటున్నాడు. ఇందుకోసం తనే స్వయంగా నిర్మాతగానూ మారే ప్రయత్నం చేస్తున్నాడు. అంత ధీమా ఉన్న ఆ కొత్త డైరెక్టర్ మరెవరో కాదు.. ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్ రసూల్ పొకుట్టి. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా ఆస్కార్ అందుకుని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కేరళీయుడు రసూల్.. దర్శకత్వంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాడు.
తొలి ప్రయత్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ బాలీవుడ్ సినిమా తీయాలనుకుంటున్నాడు రసూల్. ఇంకా కాస్టింగ్ విషయం తేలలేదు కానీ.. బడ్జెట్ మాత్రం రూ.300 కోట్లు అవుతుందని అంచనా వేశాడు. ఈ సినిమాను తనే స్వయంగా నిర్మించాలనుకుంటున్నాడు. ఫండింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తనే స్వయంగా లీ పెంటా ఎంటర్టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను మొదలుపెట్టిన రసూల్.. రిలయన్స్ ఎంటర్టైన్‌మెంట్ మాజీ చీఫ్ రామనాథన్, మరో ముగ్గురితో కలిసి ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నాడు. వచ్చే మూడు నెలల్లో ఈ 300 కోట్లు సమీకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఎలా సమీకరిస్తాడో ఏంటో కానీ.. టార్గెట్ రీచ్ అయితే మాత్రం 'ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్'గా బాహుబలి పేరిట ఇప్పుడున్న రికార్డు బద్దలైపోతుందంతే.