మహేష్‌ మమ్మీ-డాడీలు అదుర్శ్‌

Update: 2015-06-30 08:40 GMT
ఫ్యామిలీతో ఎటాచ్‌మెంట్‌ ఉన్న హీరోగా సూపర్‌స్టార్‌ మహేష్‌కి పేరుంది. అమ్మ, నాన్న, అక్క, బావ, మేనబావ, అన్నలు .. ఇలా అందరితోనూ మహేష్‌ ఎంతో కలివిడిగా ఉంటాడు. ముఖ్యంగా అమ్మా-నాన్న అంటే తనకి రెండు కళ్లు. నవతరానికి ఆదర్శవంతమైన యువకుడిగా ప్రిన్స్‌ని చూపించవచ్చు. అయితే మహేష్‌ మమ్మీ-డాడీ మారిపోవడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చకొచ్చింది.     అయితే వాస్తవ జీవితంలో కాదులెండి. వెండితెరపైనే ఇలా జరుగుతోంది.

అప్పట్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ప్రకాష్‌రాజ్‌- జయసుధ మహేష్‌కి అమ్మా -నాన్నలుగా నటించారు. తండ్రి బాటలో వెళ్లే కొడుకుగా అన్నకు తగ్గ తమ్ముడిగా ఆ చిత్రంలో మహేష్‌ నటించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్‌కి అమ్మా నాన్నలుగా సుకన్య- జగపతిబాబు నటిస్తున్నారు. పెద్దరికం తర్వాత మళ్లీ జంటగా నటిస్తున్నారు ఈ ఇద్దరూ. మహేష్‌కి అమ్మా నాన్నలుగా నటించడంపై జగపతి-సుకన్య చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నారని సమాచారం.

అలాగే శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న 'బ్రహ్మూెత్సవం'లో మళ్లీ తల్లిదండ్రులు మారిపోతున్నారు. ఈ సినిమాలో రేవతి- సత్యరాజ్‌ మహేష్‌కి తల్లిదండ్రులుగా ఎంపికయ్యారు. మొత్తానికి మహేష్‌ పేరెంట్స్‌ ఎవరు నటించినా కూడా వారు కేక అనమాట. రచ్చ చేస్తున్నారంతే. అదుర్శ్‌.

Tags:    

Similar News