పీసీ హెయిర్‌ స్టైల్‌ పై వర్మ కౌంటర్‌

Update: 2019-05-08 09:11 GMT
ఇటీవల అమెరికాలో జరిగిన మెట్‌ గాలా కార్యక్రమంలో ప్రియాంక చోప్రా మరియు దీపిక పదుకునేలా చాలా విచిత్రమైన కాస్ట్యూమ్స్‌ మరియు మేకప్‌ లో కనిపించిన విషయం తెల్సిందే. వీరిద్దరి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో వీరిద్దరి ఫొటోలపై తెగ విమర్శలు వెళ్లువెత్తాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా డ్రస్‌ మరియు హెయిర్‌ స్టైల్‌ పై నెటిజన్స్‌ పెద్ద ఎత్తున జోకులు వేస్తున్నారు. పిచ్చుక గూడును నెత్తిన పెట్టుకున్నట్లుగా ఉందని, నెత్తి పైన సెల్‌ ఫోన్‌ టవర్లు పెట్టుకుంది అంటూ రకరకాలుగా కామెంట్స్‌ చేశారు.

ఇక రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ప్రియాంక చోప్రా హెయిర్‌ స్టైల్‌ పై స్పందించడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యింది. ప్రియాంక హెయిర్‌ స్టైల్‌ కు సెల్యూట్‌ చేశాడు. ఇక ప్రియాంక జుట్టును వీరప్పన్‌ మీసాలుగా ఒక వ్యక్తి ఫొటో షాప్‌ లో ఎడిట్‌ చేసి పెట్టడం జరిగింది. ఆ ఫొటోలో వీరప్పన్‌ మీసాల మాదిరిగా ప్రియాంక జట్టు సరిగ్గా సెట్‌ అయ్యింది. దాంతో వర్మకు ఆ ఫొటో తెగ నచ్చినట్లుంది. అందుకే ఆ ఫొటో పోస్ట్‌ చేసిన వ్యక్తికి సెల్యూట్‌ చేస్తూ వర్మ ట్వీట్‌ చేశాడు. మొత్తానికి ప్రియాంక చోప్రా హెయిర్‌ స్టైల్‌ సోషల్‌ మీడియాలో చర్చకు పెద్ద స్కోప్‌ ఇచ్చింది.
Tags:    

Similar News