రామ్ గోపాల్ వర్మ ప్రతిసారీ ఏదో ఒక బలమైన నిజజీవిత కథను ఎంచుకుని అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. తాజాగా వర్మ చేతికి లబించిన బ్రహ్మాస్త్రం కొండా మురళి. వరంగల్ రాజకీయ ముఖ చిత్రంలో.. జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకంగా నిలిచిన వ్యక్తులు కొండా మురళి... కొండా సురేఖ.. వీరి ప్రేమకథ.. కొండా మురళీ రాజకీయ జీవితం.. వారి జీవితాల్లో జరిగిన నాటకీయ పరిణామాల పై సినిమా తీస్తూ ఇటీవల రాజకీయ వర్గాలు సహా అందరి దీష్టిని ఆకర్షించారు.
కొండా జీవిత కథ ఆధారంగా వర్మ `కొండా` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. `నేను విజయవాడలో చదవటం మూలాన నాకు అక్కడి రౌడీల గురించి తెలుసు. రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ మూలాన ఫస్ట్ టైమ్ నేను రాయలసీమ ఫ్యాక్షనిస్టుల గురించి తెలుసుకున్నాను. కానీ నాకు తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్న మొన్నటి వరకు కూడా ఏమీ తెలియదు. ఈ మధ్య కో ఇన్సిడెంటల్ గా కొంత మంది మాజీ నక్సలైట్ లు.. ఇంకొంత మంది అప్పటి పోలీస్ ఆఫీసర్ల నుంచి నాకు ఫస్ట్ టైమ్ ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చింది. నేను విన్న విషయాల్లో నన్ను విపరీతంగా ఆకర్షించింది ఎన్ కౌంటర్ లో చంపేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకి ..ఇంకా కొండా మురళికి వున్న ఒక మహా ప్రత్యేకమైన సంబంధం..ఆ ఎక్స్‌ట్రార్డినరీ బ్రాగ్రౌండ్.. అప్పటి పరిస్థితులు.. సినిమాటిక్ గా క్యాప్చర్ చేయటానికి నేను మురళీగారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి కోపరేట్ చేయమని కోరటం జరిగింది. ఈ సినిమా తీయటం వెనకున్న నా ఉద్దేశాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు`` అని అప్పట్లో ఆర్జీవీ వెల్లడించారు.
విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కారల్ మార్క్స్ 108 ఏళ్ల క్రిమే చెప్పారు. అలా విపరీత పరిస్థితుల మధ్య పుట్టిన వారే కొండా మేరళి .. కొండా సురేఖ.. నేను తీస్తున్నది సినిమా కాదు రక్త చరిత్ర.. అంటూ వర్మ సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా ద్వారా ఉత్తర తెలంగాణకు గుండెకాయ అయినటు వంటి వరంగల్ చరిత్రలో సంచలనంగా మారిన పలు ఆసక్తికర విషయాలతో పాటు ప్రపంచం నివ్వెరపోయే సంఘటనలకు సంబంధించిన సాక్ష్యాలు బయటికి రానున్నాయి.
కొండా మూవీ సైలెంట్ గా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ప్రచారానికి తెరలేపుతూ ఆర్జీవీ వేడి పెంచుతున్నారు. 25 డిసెంబర్ క్రిస్మస్ రోజున ఆర్జీవీ ర్యాప్ పార్టీని నేరుగా కొండా ఫ్యామిలీ ఇలాకాలోనే ప్లాన్ చేశారు. వరంగల్ లో జరిగే ఈ ఈవెంట్ 7.45 నుంచి టీవీల్లో లైవ్ స్ట్రీమింగ్ అవ్వనుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ వేడుకకు కొండా ఫ్యామిలీ సభ్యులు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు జనంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. గాంధీ లెక్క చెంప చూపెట్ట నేను.. చంపేస్తా.. అర్థం కాలే! అంటూ పోస్టర్ ని ముద్రించి రక్తం మరిగించారు. ఈ మూవీని యోయో టాకీస్ బ్యానర్ పై మల్లారెడ్డి.. నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు.