ఎన్టీఆర్ బయోపిక్ తో సమాంతరంగా అదే వ్యక్తి మీద రామ్ గోపాల్ వర్మ తాను సినిమా తీస్తానని ప్రకటించినప్పుడు మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. నట వారసుడిగా బాలకృష్ణ తీసే మూవీకే ప్రజలు పట్టం కడతారని అందరూ భావించారు. కాని జరిగింది వేరు. కథానాయకుడు మహానాయకుడు ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతూ డిజాస్టర్స్ లో మొదటి స్థానం కోసం పోటీ పడ్డాయి. మొదటిదే చాలా నయం అనుకునేలా సీక్వెల్ కనీసం 5 కోట్లు షేర్ కూడా తెలేని దీన స్థితిలో ఉంది.
మరో పక్క వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ దూకుడు పెంచుతోంది. దానికి సంబంధించిన ఏ ప్రమోషనల్ మెటీరియల్ అయినా గంటల్లో వైరల్ అయిపోతోంది. నిన్న ఓ వీడియో సాంగ్ ని రిలీజ్ చేస్తే ఇరవై నాలుగు గంటలు దాటకుండానే మిలియన్ వ్యూస్ తెచ్చేసుకుంది. మరోపక్క వారం క్రితం విడుదలైన ట్రైలర్ 9 మిలియన్లకు చేరువలో ఉంటూ మహానాయకుడు కంటే చాలా రెట్లు పైన నిలిచింది
ఇప్పుడు ఎన్నడూ లేనిది లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం బయ్యర్ల ఒత్తిడి పెరిగింది. వర్మ సినిమా రేంజ్ కు ఎన్నో రెట్లు ఎక్కువ స్థాయిలో ధరను కోట్ చేస్తున్నారని తెలిసింది. సోషల్ మీడియాలో దీని మీద వ్యక్తమవుతున్న ఆసక్తి నందమూరి క్యాంపును వ్యతిరేకించే వర్గాలు చేస్తున్న ప్రచారం అంతా కలిసి మూకుమ్మడిగా లక్ష్మీస్ ఎన్టీఆర్ కు పెద్ద ఫేవర్ చేస్తున్నాయి. సినిమా బాగుంటే వర్మ పంట పండినట్టే. చాలా తక్కువ బడ్జెట్ కాబట్టి రూపాయికి రెండు రూపాయల లాభం.
ఒకవేళ ఎప్పటిలాగే నిరాశ పరిచినా ఇప్పుడున్న క్రేజ్ ప్రకారం ఫస్ట్ డే కే సేఫ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే కనక జరిగితే మహానాయకుడు కంటే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా ఆడిందని వర్మ భుజాలు ఎగరేస్తాడు. విడుదల తేది ప్రకటించే దాకా వర్మను నమ్మడానికి లేదు కాని తన సినిమాకు కోరుకున్న దాని కన్నా ఎక్కువ బజ్ వచ్చేలా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు