అవును.. అమరావతి సచివాలయంలోకి డేంజరస్ వైరస్ ప్రవేశిస్తోంది. ఈ వైరస్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇన్నాళ్లు టికెట్ వెతలు తీరని టాలీవుడ్ కి ఒక్కసారిగా అనూహ్యమైన పరిష్కారం చూపిస్తుందట ఈ వైరస్. ఏంటో కాస్త సిత్రంగా ఉన్నా కానీ ఇది నిజం!
ఇన్నాళ్లుగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో మంత్రి పేర్ని నాని వార్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. టీవీ చానెళ్లలో వరుస డిబేట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఆ ఇద్దరూ. సినిమా హీరోల పారితోషికాలను సమర్థిస్తూ ఆర్జీవీ ఏపీ ప్రభుత్వంపైనా పేర్నిపైనా పంచ్ లు వేసిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల్ని నిర్ణయించుకునే హక్కు ఇండస్ట్రీకే ఉండాలని ఆర్జీవీ ఎటాక్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఇద్దరి మధ్యా వార్ పీక్స్ కి చేరుకున్న క్రమంలో ఇప్పుడు పేర్నితో ఆర్జీవీ సచివాలయ సమావేశ నిర్ణయం హీటెక్కిస్తోంది.
సామాజిక బాధ్యత లేదు! అని అందరూ అనుకునే ఆర్జీవీ తో మంత్రి పేర్ని నాని సమావేశం అంటూ ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ నెల 10న ఆర్జీవీతో అమరావతి సచివాలయలో భేటీకి పేర్ని నాని సిద్ధమవుతున్నాని తెలిసింది. సానుకూలంగా సినీ పరిశ్రమ కి మంచి జరుగుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను అర్జీవీ అభిమాని అని పేర్ని నాని చెప్పటం గ్రేట్ అని.. ఇంతటి తో వివాదాలకు తెర పడే అవకాశం ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. సినీపరిశ్రమ పెద్దలతో మంతనాలు సాగిస్తున్న పేర్ని నాని ఇప్పుడు ఆర్జీవీతో సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు టికెట్ రేట్ల సమస్య పరిష్కారం అవుతుందా? అంటే.. దేనికైనా ఆరోజే క్లారిటీ వస్తుందేమో! వాగ్వాదాలతో వివాదాస్పదం కాకపోతే ఆర్జీవీ పరిష్కారం చూపించినట్టే!!