'చికోటి'ని కలిసిన ఆర్జీవీ.. మరో సంచలనం రాబోతుందా?

Update: 2022-11-02 08:30 GMT
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన సినిమాల కంటే కూడా కాంట్రవర్సీలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. హిట్స్.. ప్లాపులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ ఉంటూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడం ఆర్జీవి దిట్టా అనే సంగతి అందరికీ తెలిసిందే. సినిమా.. రాజకీయాలు అనే తేడా లేకుండా ఇటీవల కాలంలో ప్రతీ కాంట్రవర్సీలోను ఆర్జీవీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్జీవీ కలువడం చర్చనీయాంశమైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాంగోపాల్ వర్మ వైసీపీకి అనుకూలంగా మూడు సినిమాలను చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇందులో ఒక సినిమాకు 'జగన్నాథ రథ చక్రాలు' అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా రాంగోపాల్ వర్మ వైల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన చీకటి ప్రవీణ్ ను కలిశారు. తన ఫామ్ హౌస్ లోని అన్యదేశ జంతువుల సేకరణను తిలకించారు. అనంతరం కొద్దిసేపు చీకోటి ప్రవీణ్ తో కలిసి పలు విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ను ఆర్జీవీ స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

అయితే ఇటీవల క్యాసినో.. హవాలా రూపంలో డబ్బుల పంపిణీకి సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు చీకటి ప్రవీణ్ ను విచారించారు. చీకటికి రాజకీయ నాయకులు, సెలబ్రటీలతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై తనను కావాలని ఎవరైనా ఇరికిస్తే అందరి బండారం బయట పెడుతారనని చికోటి ప్రవీణ్ హెచ్చరించినట్లు ఓ వీడియో అప్పట్లో వైరల్ అయింది. అయితే ఈ వీడియో తనది కాదని ఆయన ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆర్జీవీ చికోటిని కలవడంతో వైల్డ్ మ్యాన్ బయోగ్రఫీపై ఆర్జీవీ సినిమా చేయబోతున్నారా? అనే టాక్ నడుస్తోంది.

మాఫియా.. ఫ్యాక్షన్ సినిమాలను కేరాఫ్ గా నిలిచే రాంగోపాల్ వర్మ త్వరలోనే చికోటిపై సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్జీవీ ఆయనను కలిసి చర్చించినట్లు వినికిడి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చికోటి ప్రవీణ్ తన ఫాంహౌజ్ ను ఒక మినీ జూగా మార్చివేయడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News