హీరోల పారితోషికాల‌పై వ‌ర్మ అభిప్రాయం ఇదే!

Update: 2022-07-21 07:30 GMT
స్టార్ హీరోల పారితోషికాలు ఇప్పుడు ఇండ‌స్ర్టీలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. కాస్ట్ ఆఫ్ ప్రొడ‌క్ష‌న్ పెరిగిపోవ‌డం స‌హా ఇత‌ర కార‌ణాల‌తో  ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నాయి. నిర్మాత‌ల‌కు అనుకూలంగా గ‌నుక హీరోలు దిగిరాక‌పోతే  సినిమా మ‌నుగడే ప్ర‌శ్నార్ధంక అవుతంద‌ని ఇప్ప‌టికే అల్టిమేటం జారీ అయింది.

నిర్మాణం బంద్ పెట్ట‌డానికి ఇంకా ప‌లు కార‌ణాలు తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ హీరోల పారితోషికాలు హైక్ అనే మాటే ప్ర‌ధానంగా  హైలైట్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగో పాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు. ''ఏ స్టార్ హీరో కూడా ఇంత కావాల‌ని  డిమాండ్ చేయ‌డు. ఇది పెద్ద బూతు.  ఇక్క‌డ సింపుల్ లాజిక్ ఆలోచించాలి.

డ‌బ్బు అడిగే వాడిది త‌ప్పా? ఇచ్చే వాడిది త‌ప్పా? అన్న‌ది ఆలోచించాలి. నాకు ప‌ది కోట్లు ఇవ్వండ‌ని అడుగుతాను. ఇవ్వ‌డం ఇవ్వ‌క‌పోడం అన్న‌ది వాళ్లు ఇస్టం. ప‌ది రూపాయ‌లు కూడా వ‌ర్త్ లేద‌న‌కుంటే అక్క‌డే ఇద్ద‌రి మ‌ధ్య  మ్యాట‌ర్ క్లోజ్ అయిపోతుంది. మ‌హేష్  బాబు వ‌ర్త్ మ‌హేస్ బాబుకి కి కూడా తెలియ‌దు. వ‌ర్త్ గురించి నిర్మాత వ‌చ్చి హీరోకి చెబుతాడు.

బాబు మీ సినిమా ఇంత వ‌సూల్ చేసింది. 100కోట్లో..200కోట్లో ఫిగ‌ర్ చెబుతాడు. మేకింగ్ కాస్ట్ ఇంత అవుతుంది. అందుక‌ని నేను ఇంత ఇస్తా అంటాడు. అప్పుడే మ‌హేష్ కి త‌న వ‌ర్త్ ఎంత‌న్న‌ది తెలుస్తుంది. అత‌న‌నే కాదు ప్ర‌తీ హీరో విష‌యంలో జ‌రిగేది అదే. అవ‌త‌లి వాడు ఇస్తేనే వ‌ర్త్. సొంతంగా ఎవరికి  వ‌ర్త్  అనేది  ఉండ‌దు. గ‌త స‌క్సెస్ ల్ను చూసి వ‌ర్త్ ఇవ్వ‌డం జ‌ర‌గుతుంది.

మార్కెట్  ని బ‌ట్టి ఒక్కో నిర్మాత ఎక్కువ ఇవ్వొచ్చు. ఎందుకు ఇస్తాన‌డంటే  మ‌హేస్ తో ఫోటో దిగ‌డానికి అవ‌కాశం కోసం . అప్పుడేంటి? ఒక బ్రాండ్ కి విలువ క‌డుతున్న‌ట్లు లెక్క‌.  పెయింటింగ్ విలువ‌ను బ‌ట్టే ధ‌ర  నిర్ధారిస్తారు. ఇండ‌స్ర్టీలో జ‌రిగేది అదే. కాబ‌ట్టి అగ్ర హీరోల పారితోషికాల గురించి ప్ర‌శ్నించ‌డం క‌న్నా పిచ్చిత‌నం మ‌రొక‌టి ఉండ‌దు.

స్టార్ హీరో సినిమాని ఎంత మంది చూస్తారు అన్న కార‌ణంతో సినిమా విక్ర‌యం జ‌రుగుతుంది. అప్పుడు కాస్ట్  ఎంత అయింద‌న్న విష‌యంలో హీరోకి సంబంధం లేదు.  నిర్మాత‌లే  హీరోల ద‌గ్గ‌ర‌కు వెళ్తారు. వాళ్లే  హీరోల డిమాండ్ పెంచుతారు. అలాంట‌ప్ప‌డు ఇస్తామంటే ఎవ‌రు వ‌ద్దంటారు? అని వ‌ర్మ చెప్పుకొచ్చారు. హాలీవుడ్ లో ఎవ‌రూ ముందు పారితోషికాలు తీసుకోరు.  నిర్మాత‌ పెడుతాడు.  సినిమా ఫ‌లితం త‌ర్వాత రేషియో ప్రాతిప‌దిక‌న వాటాలు తీసుకుంటారు. బాలీవుడ్ లో కూడా ఇలాంటి విధానం అమ‌లులో ఉంద‌న్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా వ‌ర్మ గుర్తు చేసారు.
Tags:    

Similar News