గారెలు పకోడాలు వేడిగా ఉన్నప్పుడే తినాలి. కరోనా భయాలు పోకుండానే వ్యాక్సిన్ అమ్మాలి. అలాగే కరోనాపై సినిమాలు తీసేవాళ్లు ఈ భయాలు తొలగక ముందు రిలీజ్ చేస్తేనే జనం చూస్తారు. ఒకసారి భయం మటుమాయం అయ్యాక జనం రిలాక్సయిపోయాక రిలీజ్ చేసినా కలిసొచ్చేదేమీ ఉండదు. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు? అన్నట్టే జనం థియేటర్లకు రారు. ఓటీటీల్లోనూ పెద్దగా పట్టించుకోరు. అలాంటి సన్నివేశంలోనే ఆర్జీవీ `కరోనా వైరస్` సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారా? అంటే .. ఈ ఆలస్యం చూస్తుంటే అదే నిజమయ్యేట్టు ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ ఫ్లాపయ్యాక అరడజను మొదలు పెట్టినా ఏదీ రిలీజ్ కి రాలేదు. ఇప్పటికీ ఆర్జీవీ హడావుడి తప్ప ఏదీ కనిపించడం లేదు. త్వరలోనే కరోనా వైరస్ మూవీని రిలీజ్ చేస్తాడట. కానీ ఎందుకీ ఆలస్యం? కనీసం ప్రచారం అయినా సరిగా లేదే! అంటూ ఒకటే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా ఆర్జీవీ ఎందుకీ నిశ్శబ్ధం? అని ప్రశ్నిస్తున్నారు కొందరైతే.
ఎందుకిలా అని పదే పదే ఆర్జీవీని ప్రశ్నిస్తే సీరియస్ గా అర డజను సినిమాలతో బిజీగా ఉన్నందున నిశ్శబ్దంగా ఉన్నానని అనేస్తాడు. ఇప్పటికి ఇంకా కరోనా లైవ్ లోనే ఉంది ఎటూ పోలేదు. జనాల్లో భయం మాత్రం పోయింది. కాబట్టి రిలీజ్ కి సమయం మించిపోతోంది అంటున్నా ఆర్జీవీ ఎందుకనో నిశ్శబ్ధంగానే ఉన్నారు. అయితే కరోనా అంతమైనా ఆ భయాలు తమ నుంచి వెళ్లిపోని ఆడియెన్ కి మాత్రమే ఆర్జీవీ సినిమా చూపిస్తారట. ఆ భయాలు ఉన్నవాళ్లకు మాత్రమే!నని అంటున్నారట. మరి అదే నిజమైతే భయాలు లేని వాళ్లు చూడాల్సిన పనే లేదనే దీనర్థమా?
అయినా ఆర్జీవీ ఏటీటీ రిలీజ్ లకే మరీ ఇంత ఆలస్యం చేస్తే ఎలా? కనీసం ఓటీటీ అయినా కాదు కదా! అని సెటైర్ల వేసే వారికి మీరేమని సమాధానమిస్తారో? అయినా పీకే వీరాభిమానులు మీ సినిమా కోసమే కదా వెయిటింగ్ .. ఎందుకు ఇంకా ఆలస్యం?!