కాంట్రవర్సీలతోనే పబ్లిసిటీ చేసుకోవడంలో ఎక్స్ పర్ట్ అయిన వర్మ తన ఫోకస్ అంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారం మీదే పెడుతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో మోతెక్కిపోతుండగా విడుదల తేదీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ జీవితంలో రెండో పెళ్లి తర్వాత జరిగిన ఘటనలను తీసుకున్న వర్మ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసిన విషయం ప్రమోషనల్ మెటీరియల్ లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. రిలీజ్ గురించి అనుమానాలు నెలకొని ఉన్నప్పటికీ వర్మ తన పని తాను చేసుకుపోతూనే ఉన్నాడు.
కొన్ని పాత్రలను ట్రైలర్ లో చూపించినప్పటికీ ఇంకొన్ని గుట్టుగా దాచాడు . అందులో ఒకటి పరిటాల రవీంద్ర. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కానీ విజువల్ కానీ వర్మ చూపించలేదు కానీ ఇక్కడ మీరు చూస్తున్న పిక్ ఆ నటుడిదే. ఎన్టీఆర్ కు అత్యంత నమ్మకస్తుడైన సన్నిహితుడిగా చెప్పుకునే పరిటాల పాత్రను పోషిస్తున్న నటుడు పేరు నరేంద్ర నాయుడు. ఇతనో అప్ కమింగ్ ఆర్టిస్ట్. పరిటాల రవి మీద చెప్పుకోదగ్గ సన్నివేశాలే ఇందులో ఉన్నాయట.
గతంలో ఆయన కథనే వివేక్ ఒబెరాయ్ తో రక్త చరిత్రగా తీసి వర్మ మెప్పించాడు. అయితే ఇది చిన్న బడ్జెట్ లో ప్లాన్ చేసిన మూవీ కావడంతో ఆర్టిస్టులను కూడా దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే లక్ష్మి పార్వతితో పెళ్లయ్యాక ఎన్టీఆర్ తో పరిటాల రవి సంబంధాలు ఎలా ఉండేవి అనేది కూడా చూపబోతున్నారన్న మాట. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదల కావడం అనుమానంగానే ఉంది. ఈ కొద్దిరోజుల్లో వర్మ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో వేచి చూడాలి