సిద్దూ హత్యపై ఆర్జీవీ సంచలన పోస్టు : వైరల్

Update: 2022-05-31 05:00 GMT
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి న్యూస్ మేకర్ గా మారారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివాదాస్పద ట్వీట్లు చేసే ఈ డైరెక్టర్ లెటేస్టుగా ట్విట్టర్ లోమెరిశాడు. ఇటీవల హత్యకు గురైన పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూస్ వాలా హత్యపై స్పందించాడు. ఈ హత్యపై ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.. దేశంలో ఎక్కడ క్రైం జరిగినా మొదట స్పందించేది ఆర్జీవీనే. ఇప్పుడు కూడా ఆయన మూస్ వాలా హత్యపై తన ట్విట్టర్లో మెసెజ్ పెట్టాడు. ఆ మేసేజ్ పై ఇప్పుడు తీవ్ర చర్చలు సాగుతున్నాయి.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిద్దూ మూస్ వాలా ప్రముఖ గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. పాప్ సాంగ్స్ పాడి జనాలను ఉర్రూతలూగించాడు. గేయ రచయితగా కెరీర్ ఆరంభించి లైసెన్స్ అనే పాటతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఆ తరువాత జీ వ్యాగన్ అనే పాటతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన డెవిల్, లెజెండ్, జస్ట్ లిజెన్ తామైయాన్ దా పుట్జ్ జాట్ దా ముకాబులా, బ్రౌన్ బాయ్స్, హత్యార్ లాంటి సూపర్  హిట్ సాంగ్స్ ను అందించాడు. అయితే ఆయన సిక్కు మతానికి చెందిన ఆయుధాలు, గన్ కల్చర్ గురించి కూడా పాటలు పాడారు. కానీ ఇవి వివాదాస్పదమయ్యాయి. గన్ కల్చర్ ను ప్రమోట్ చేస్తున్నారని కేసులు కూడా నమోదయ్యాయి.

ఆ తరువాత సినీ రంగంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సిద్దూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే కొన్ని విషయాల్లో ఆయన వివాదాస్పదుడిగా మారడంతో ఆయనకు బెదిరింపు కాల్స్ బాగానే వచ్చాయి. తనను చంపేస్తానని కొందరు అనడంతో సిద్ధూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు భద్రత కల్పించింది. కానీ కొన్ని కారణాల వల్ల సెక్యూరిటీని తొలగించిన మరుసటి రోజే కొందరు దుండగులు సిద్దూ కారుపై కాల్పులు జరిపారు. దాదాపు 20 రౌండ్లు మరణించేవరకు కాల్చారు.

ఈ నేపథ్యంలో ప్రముఖులు ఆయన ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ  ట్విట్టర్ వేదికగా స్పందించారు. 1997లో టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య జరిగింది.  

ఆ తరువాత అంతటి ఘోరాన్ని మళ్లీ ఇప్పుడు చూడాల్సి వచ్చింది. కోట్లాది మంది సంగీత ప్రేమికులు ఆరాధించే సిద్ధూ లాంటి ప్రముఖులకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. కొన్ని చోట్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Tags:    

Similar News