రామ్ గోపాల్ వర్మలో ఈ మధ్య ఎక్కడ లేని సామాజిక స్పృహ కనిపిస్తోంది. ఎప్పుడూ ఎవరేమైపోతే నాకేంటి నా ఆనందం నాకు ముఖ్యం అన్నట్లు వ్యవహరించే వర్మ.. కరోనా వైరస్ కలకలం మొదలైన దగ్గర్నుంచి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ వైరస్ గురించి జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్నిసార్లు తనదైన శైలిలో కామెడీ చేస్తున్నప్పటికీ, కొన్నిసార్లు సీరియస్ గా జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన కరోనా మీద ఒక పాట రాసి పాడేశాడు. అయితే నిన్న సడన్ గా నాకు కరోనా పాజిటివ్ అంటూ ట్వీట్ చేసి అందర్నీ షాక్ కి గురి చేసాడు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోంచి అడుగు కూడా బయటికి పెట్టడం లేదు. అంతలోనే ఈయనకు కరోనా పాజిటివ్ రావడం ఏంటి అనుకున్నారు నెటిజన్లు.
ఇప్పుడే తన డాక్టర్ ఫోన్ చేసి నీకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు అంటూ ట్వీట్ చేసాడు వర్మ. అది చూసి అభిమానులు ఇంత జాగ్రత్తగా ఉన్నావు.. కనిపించని పురుగు అంటూ పాట కూడా పాడావు కదా వర్మ.. అంతలోనే నీకెలా వచ్చిందయ్యా కరోనా అంటూ కామెంట్స్ పెట్టారు. బయటికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే లాక్ అయిపోయావు కదా.. ఎవర్నీ కలవలేదు.. పైగా నువ్వే అందరికీ చెబుతున్నావ్.. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న నీకే ఎలా వచ్చింది వర్మ ఈ కరోనా అంటూ నెటిజన్స్ ఈయన్ని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అంతా షాక్ అవుతున్న వేళ 'ఏప్రిల్ ఫూల్' అంటూ ఆయనలోని సైకో నిద్ర లేచాడు. ఆ ట్వీట్ చేసిన 15 నిమిషాలకు 'సారీ అందర్నీ డిజప్పాయింట్ చేసాను.. నాకు కరోనా లేదంట.. నా డాక్టర్ నన్ను ఏప్రిల్ ఫూల్ చేసాడు.. ఇది నా తప్పు కాదు ఆయనదే' అంటూ మరో ట్వీట్ చేసాడు. అది చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనాతో కూడా కామెడీ చేస్తున్న వర్మను చూసి అంతా తిట్టుకుంటున్నారు. అయితే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉన్నా దాన్ని కామెడీ చేయడానికి చూస్తాను.. నా మీదే జోక్ చేసుకున్నా కాబట్టి ఎలాంటి సమస్యా లేదంటున్నాడు వర్మ. అయినా కూడా ఇలాంటి విషయాల్లో జోక్స్ చేయకూడదంటున్నారు అభిమానులు. రేపు నిజంగానే కరోనా వచ్చినా నిన్ను పట్టించుకొనే వాడు ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.