నా హీరోని తొల‌గించి హీరోయిన్ థై షో చూపించారు!-ఆర్జీవీ

Update: 2022-09-01 04:15 GMT
రంగుల మాయా ప్ర‌పంచంలో ఎన్నో చిత్ర‌విచిత్రాలు చూస్తుంటాం. ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు మేక‌ర్స్ ఎలాంటి గిమ్మిక్కులు చేస్తుంటారో చాలా క‌థ‌నాలు వెలువడ్డాయి. కానీ వాట‌న్నిటి కంటే కొత్త విష‌యాల‌ను ఆర్జీవీ ఇప్పుడు బ‌హిరంగంగా వెల్ల‌డించారు. ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌ను ఎలా మోసం చేస్తారో కూడా ఆయ‌న వ‌ర్ణించి చెప్పారు.

B - C సెంటర్ లలోని ఎగ్జిబిటర్లు అజయ్ దేవగన్ తో తాను తీసిన `కంపెనీ` మూవీ క్లాసీ పోస్టర్ ను మార్చారని వెల్లడించారు. హీరో స్థానంలో హీరోయిన్ ఇషా కొప్పికర్ థైషోస్ ఎలివేష‌న్ ని పోస్ట‌ర్ లో చూపించార‌ని తెలిపారు.

అయితే మేకర్స్(నిర్మాత‌లు) అందించిన పోస్టర్లను వేయడానికి డిస్ట్రిబ్యూటర్లు లేదా ఎగ్జిబిటర్లు నిరాకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బదులుగా వారు వాణిజ్యపరంగా ఆకర్షణీయమైన స్టిల్స్ లేదా పాత చిత్రాల స్నాప్ షాట్ లను తీసుకుని వాటిని తార‌ల‌ తాజా చిత్రం తాలూకా పోస్టర్ లాగా చూపించిన సంద‌ర్భాలున్నాయ‌ని వెల్ల‌డించారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షించడమే దీని వెనుక ఉన్న ఆలోచన. ఇది మోసానికి దారితీసినా పర్వాలేదు.. అని కూడా ఆర్జీవీ అన్నారు.

ఇటీవ‌ల దేవ‌గ‌న్ న‌టించిన దేదే ప్యార్ దే పై అజ్మీర్ వాసి కోర్టుకు వెళ్లి రూ. 4.50 లక్షలు దావా వేసిన సంగ‌తి తెలిసిందే. ఫిర్యాదుదారు ప్రకారం.. 2019 రొమ్ కామ్ దే దే ప్యార్ దే ప్లే చేస్తున్న స్థానిక సినిమా హాల్ అజయ్ స్టంట్ చేస్తున్నట్లు చూపించే పోస్టర్ ను వేశారు. అయితే ఆ సీన్ సినిమాలో లేదు. కానీ పబ్లిసిటీ .. ప్రమోషనల్ మెటీరియల్ కు అజయ్ బాధ్యత వహించలేనని అతని న్యాయ బృందం స్పష్టం చేయడంతో ఈ కేసులో అతనికి ఉపశమనం లభించింది. హోర్డింగ్ లు పోస్టర్ లు లేదా ఎడిట్ చేయాల్సిన భాగాలపై నిర్ణయం తీసుకోవడంలో తార‌ల‌కు ఎలాంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది.అలా ఆ కేసు నుంచి అత‌డు బ‌య‌ట‌ప‌డ్డాడు.

తాజా ఇంట‌ర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ-``అజయ్ దేవగన్ నటించిన తన సినిమా కంపెనీ (2002)లో కూడా అలాంటి సవరించిన పోస్టర్లు తయారు చేసి గోడ‌ల‌పై వేశామ‌ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ -``అజయ్ దేవగన్ -వివేక్ ఒబెరాయ్ నటించిన నా సినిమా కంపెనీ క్లాస్ పోస్టర్ ని డిజైన్ చేసాను. మూవీ విడుదలైనప్పుడు ఉత్తరాదిలో ఎవరూ ఆ పోస్టర్ ను వేయలేదు. వారు ఒక కొత్త పోస్టర్ ను రూపొందించారు. ఇందులో అజయ్ దేవగన్ వేరే చిత్రం నుండి తుపాకీ పట్టుకున్నారు. ఇషా కొప్పికర్ తన తొడలను ఎక్స్‌పోజ్ చేస్తూ కూడా చూపించారు. నేను దానిని నా పోస్టర్ లలో ఎప్పుడూ వేయలేదు! వారు దానిని మూవీ నుండి కాకుండా ఇంకా ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు!`` అని కూడా తెలిపారు.

అయితే పంపిణీదారులు అలా చేయడం సరైనదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు తమకు తెలిసిన ప్రేక్షకులను థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు కేటరింగ్ చేస్తున్నారు. పాట్నాలోని సింగిల్ స్క్రీన్ సినిమాలను సందర్శించే వ్యక్తికి ఆ పోస్టర్ తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి దానిలో ఒక లాజిక్ ఉంది.. అని కూడా అన్నారు.

మన సినీ ప్రముఖులకు తరచుగా దేశంలోని వాస్తవాలు తెలియవని ఏ-క్లాస్ సెంటర్లలో చేసే పనులు మాస్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చునని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని నిరూపించడానికి అత‌డు ఒక ఆసక్తికరమైన విష‌యాన్ని వివరించాడు. ``డాల్బీ - DTS భారతదేశానికి వచ్చినప్పుడు థియేట‌ర్ల‌లో ఈ సాంకేతిక‌త‌ను ఎలా నిర్వహించాలో ఫిలింమేక‌ర్స్ కి నేర్పడానికి దాని అధికారులు లండన్ నుండి విమానంలో ప్రయాణించేవారు. ధ్వని చెవుల‌కు ఇంపుగా ఉండాలంటే ఎంత వాల్యూమ్ ని కలిగి ఉండవచ్చో.. ఎడమ కుడి స్పీకర్ లో ఏ డెసిబెల్ ధ్వని రావాలో వారు నేర్పించారు. ఇలాంటి ఎన్నో విష‌యాల‌పై వారు కఠినమైన ప్రమాణాలను కలిగి ఉన్నారు`` అని తెలిపారు.

``మిస్టర్ సుభాష్ ఘయ్ త్రిమూర్తి (1996) చిత్రానికి పనిచేస్తున్న సమయం ఇది. అన్నింటినీ అధిక ధ్వనితో ప్లే చేయాలనే ధోరణి అప్పుడు ఉండేది. అయితే ఈ డాల్బీ అధికారులు అలా అన‌లేదు ``లేదు లేదు.. మీరు అలా చేయకూడ‌దు.. వాల్యూమ్ ని తగ్గించండి`` అని చెబుతుంటే సుభాష్ ఘాయ్ వారి ఆజ్ఞలతో విసిగిపోయారు. అవి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ ప‌రిస‌రాలు... వీధుల్లో ఉన్న స్టూడియోలోంచి వాళ్లను తీసుకెళ్లి ``మీ దేశంలో ఇంత ట్రాఫిక్ శబ్దం వింటున్నారా? నిత్యం కార్లలో హారన్ ను వాడుతూ అరుస్తూ మాట్లాడుతారు మా దేశంలో.. మీరు మీ ప్రేక్షకులను - మా ప్రేక్షకులను ఒకే త‌ర‌హాలో చూడ‌లేరు`` అని లండ‌న్ టెక్నీషియ‌న్స్ తో సుభాష్ ఘాయ్ అన్నార‌ట‌.

తర్వాత అదే సమయంలో విడుదలైన రజనీకాంత్ సినిమా చూడటానికి వారిని తీసుకెళ్లాడు. థియేటర్ లోపల మొదటి 30 నిమిషాల పాటు ప్రజలు అరుపులు ఉత్సాహం తప్ప ఎవరికీ ఏమీ వినిపించలేదు! సుభాష్ ఘాయ్ వారిని ఏమ‌ని అడిగారంటే...అటువంటి వాతావరణంలో ధ్వని స్థాయి గురించి మీ ఆలోచనను మీరు ఎలా పొందుపరుస్తారు? సైలెంట్ గా సినిమాలు చూసే ప్రేక్షకులకు మీరు కేటరింగ్ ఇస్తున్నారు. ఇక్కడ స్పీకర్ల నుండి వచ్చే డెసిబెల్ స్థాయి కంటే హెచ్చు స్థాయి ప్రేక్ష‌కుల శ‌బ్ధ‌మే ఉంటుంది!! అని వాస్త‌వాన్ని వివ‌రించి చెప్పార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News