రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మంచి సినిమాలను తెరకెక్కించాడు. తెలుగులో శివ వంటి ట్రెండ్ సెట్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ బాలీవుడ్ లో ఎన్నో గొప్ప రికార్డ్ బ్రేకింగ్ సినిమాలను తెరకెక్కించిన విషయం తెల్సిందే. కాని గత దశాబ్ద కాలంగా ఆయన సినిమాలు అంటేనే ప్రేక్షకులు బాబోయ్ అన్నట్లుగా భయపడే పరిస్థితి కి వచ్చింది. ఆయన తీస్తున్న సినిమాలు వివాదం అయినా అయ్యి ఉంటున్నాయి లేదంటే బూతు సినిమాలు అయినా అయ్యి ఉంటున్నాయి.
వివాదంతో సినిమాలకు పబ్లిసిటీ బాగా తెచ్చుకుంటున్నాడు తప్ప సినిమా లో కంటెంట్ ఉండటం లేదు. అలాగే రొమాంటిక్ సినిమాలు అంటూ ప్రచారం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపడం తీరా సినిమా విడుదలైన తర్వాత నిరాశ పర్చడం చాలా కామన్ అయ్యింది. వర్మ గత ఏడాది తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మరియు అమ్మ రాజ్యంలో కడప రెడ్లు తీవ్రంగా నిరాశ పర్చడం మాత్రమే కాకుండా ఆయనపై నమ్మకం కోల్పోయేలా చేశాయి. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణ లో వచ్చిన చిత్రం 'బ్యూటీఫుల్'.
ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్ కోసం హీరోయిన్ కాళ్లను వర్మ పట్టుకున్నాడు. సినిమాకు మాంచి పబ్లిసిటీ అయితే దక్కింది. కాని సినిమా మాత్రం చెత్తగా ఉంది అంటూ టాక్ పొందింది. అగస్త్య మంజు దర్శకత్వంలో వర్మ ఈ సినిమాను నిర్మించాడు. ఒక బ్యూటీఫుల్ సినిమాను తీశానంటూ వర్మ ప్రకటించడంతో అంతా కూడా కాస్త ఆసక్తి చూపించారు. కాని తీరా చూస్తే సినిమా నిరాశ పర్చింది. ఈ చిత్రం లో మూడు నాలుగు బూతు సీన్స్ తప్ప కంటెంట్ ఏమీ లేదు. 2020 సంవత్సరంను వర్మ ఫ్లాప్ తో మొదలు పెట్టాడు. ఆయనకు ఫ్లాప్ లు కొత్తేం కాదు కాని టాలీవుడ్ కు ఈ చిత్రం ఫ్లాప్ ఒక బ్యాడ్ శకునం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనవరి 1 న విడుదలైన చిన్న సినిమాల్లో ఏ ఒక్కటి కూడా కనీసం పర్వాలేదు అనిపించుకో లేక పోయాయి