గత నెలలో బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ప్లాట్ లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న ఈ యువ హీరో ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో దేశంలోని ప్రతి ఒక్కరు నిర్ఘాంతపోయారు. అయన మరణ వార్త ను ఇంకా అయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే ఈ మరణం పై రకరకాలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య కి గల కారణం వీరే అంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సుశాంత్ ఆత్మహత్య కి హీరోయిన్ రియా చక్రబర్తినే కారణమంటూ కొందరు ఆమె పై సోషల్ మీడియా లో బెదరింపులకి దిగుతున్నారు.
ఈ క్రమంలోనే తనను చంపుతామంటూ, తనపై అత్యాచారం చేస్తామంటూ కొంతమంది సోషల్ మీడియాలో బెదిరిస్తూ ఉన్నారని నటి రియా చక్రబర్తి కంప్లైంట్ చేసింది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసింది. సుశాంత్ ఆత్మహత్య కి తనకి ఎటువంటి సంబంధం లేదు అని ,అయినా కూడా తనని నిందిస్తూ, ఏడిపిస్తున్నారని.. సుశాంత్ మరణం పై విచారణ చేయించాలని ఆమె కోరింది. ఈ వ్యవహారం పై మహారాష్ట్ర మంత్రి తాజాగా స్పందించారు.
మహారాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్పందిస్తూ ... నటి రియా ఫిర్యాదుపై విచారణ చేస్తామని, ఆమెను సోషల్ మీడియాలో బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ విషయంలో మహారాష్ట్ర హోం మంత్రితో మాట్లాడి, ఆమెను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా చూస్తానంటూ ఆ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ప్రకటించారు. అలాగే మరోవైపు ఇప్పటికే రియా ఫిర్యాదు మేరకు ఆమెకు అభ్యంతకరమైన మెసేజ్ లను పంపిన ఇద్దరు ఇన్ స్టాగ్రమ్ యూజర్లపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా సమాచారం