సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఎన్నో కొత్త విషయాల్ని బయటి ప్రపంచానికి ఆవిష్కరిస్తోంది. ఈ కేసులో మాదకద్రవ్యాల సంబంధిత విషయంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చురుకుగా దర్యాప్తు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఎన్.సిబి పరిశీలనలో వచ్చిన కొన్ని డ్రగ్ చాట్‌లు `డి` అనే అక్షరాలతో ఒక వ్యక్తి గుట్టును బయటపెట్టేసాయిట. `డి` ను దీపికా పదుకొనేగా గుర్తించారని త్వరలోనే తనను ప్రశ్నించడానికి పిలిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. డ్రగ్ చాట్ నుండి ఐదుగురు ప్రముఖుల పేర్లు వెలువడ్డాయి. ఈ విషయంలో ఎన్.సిబి బాలీవుడ్ లింక్ ను పరిశీలిస్తోంది. తాజా పరిణామాలతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో చాలా చిక్కుముడులు వీడే వీలుందని అంచనా వేస్తున్నారు.
SSR మరణానికి కారకులైన వారిని దేవుడు భూమిపైనే గుర్తించి అన్ని స్కోర్ లను సరి చేస్తాడు. రియా అపాయింట్ చేసుకున్న SSR మాజీ ఉద్యోగులు చాలా విషయాల్ని స్పష్టంగా చెబుతున్నారు. వారికి తెలిసినంతవరకూ 2019 కి ముందు సుశాంత్ సింగ్ ఎప్పుడూ డ్రగ్స్ ముట్టుకోలేదని చెబుతున్నారు.
అలాగే రియా చక్రవర్తి.. షోయిక్ .. దీపేశ్ .. శామ్యూల్ మిరాండా జ్యుడీషియల్ కస్టడీ అక్టోబర్ 6 వరకు పొడిగించబడింది. రియా చక్రవర్తి యొక్క 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజు ముగిసింది. ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) సెప్టెంబర్ 9 న అరెస్టు చేసిన తరువాత ఆమె కస్టడీని సెషన్స్ కోర్టు పొడిగించింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో డ్రగ్స్ కోణాన్ని పరిశీలిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) టాలెంట్ మేనేజర్ జయ సాహాను మంగళవారం రెండో రౌండ్ ప్రశ్నించడానికి పిలిచింది. వాట్సాప్ చాట్ లో డ్రగ్స్ అడుగుతున్న క్లయింట్ ఎన్ ను జయ సాహ ప్రశ్నించిందట. ఈ విచారణలో చాలా షార్కులే బయటపడనున్నాయన్న టాక్ వినిపిస్తోంది.