సుశాంత్ మృతి చెందిన తర్వాత ఎక్కువ శాతం నెటిజన్స్ మరియు మీడియా కూడా రియాను టార్గెట్ చేసింది. ఆమెను ఈ కేసులో ప్రధాన నింధితురాలిగా జనాలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సుశాంత్ మృతికి ఆమె ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా కారణం అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆమె తన వాదన వినిపించేందుకు మీడియా ముందుకు వచ్చింది.
ఒక జాతీయ స్థాయి మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనే విషయాలను రియా వ్యక్తం చేసింది. తనతో పరిచయం అవ్వక ముందు నుండే సుశాంత్ డిప్రెషన్ సమస్యతో బాధ పడుతున్నాడు. ఆయన జాలీగా జీవితాన్ని గడిపేవాడు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసేవాడు అంది. సుశాంత్ ను తాను ప్రేమించాను. మేమిద్దరం చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతామని నేను అనుకున్నాను. కాని ఇలాంటి పరిస్థతి వస్తుందని అనుకోలేదు. సుశాంత్ మృతి చెందడంతో నేను బాధితురాలిని కాని నన్ను అంతా విలన్ చూసినట్లుగా చూసి నింధితురాలిని చేశారు. తనకు కావాల్సిన వారు మృతి చెందిన సమయంలో ఇలా నిందించడం భావ్యం కాదు. అవతలి వారి నుండి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే బాగుంటుందని ఆమె పేర్కొంది.
నాకు సుశాంత్ పరిచయం కాకముందు నుండే అతడికి మార్జువానా(ఒక రకమైన డ్రగ్) సిగరెట్ తాగడం అలవాటు ఉంది. దాన్ని నేను మార్పించేందుకు చాలా ప్రయత్నించాను కాని అతడు దాన్ని వదిలేయలేదు. ఇలాంటి సమయంలో ఈ విషయాన్ని చెప్పాల్సి రావడం బాధగా ఉంది. కాని తప్పడం లేదని రియా పేర్కొంది. ఇక మహేష్ భట్ గురించి మాట్లాడుతూ ఆయన నాకు పితృ సమానుడు అంది. నా కెరీర్ కు సంబంధించి వ్యక్తిగతంగా ఆయన నుండి ఎన్నొ సలహాలు సూచనలు తీసుకున్నాను అంది. సుశాంత్ పై మీటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ సమయంలో సుశాంత్ చాలా డిప్రెషన్ కు గురి అయ్యాడు. చాలా బాధ పడుతూ ఆ విషయమై నాతో చర్చించేవాడు అంది.