సుశాంత్ కేసులో రియాను ఇప్పటికే ముంబయి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇప్పుడు కేసు సీబీఐ వారి వద్దకు వెళ్లడంతో వారు మళ్లీ ఫ్రెష్ గా ఎంక్వౌరీ షురూ చేశారు. పోలీసులు ప్రశ్నించిన వారందరిని కూడా మళ్లీ మళ్లీ సీబీఐ వారు ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. అన్నట్లుగానే సుశాంత్ పని మనుషి మాజీ మేనేజర్ రియాను ఇంకా ఆమె సోదరుడిని కూడా విచారిస్తున్నారు. నిన్న రియాను సీబీఐ వారు మొదటి రోజు విచారించారు. నిన్న రియాను దాదాపుగా 9 గంటల పాటు ముంబయిలోని డీఆర్డీవో గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
ఈ సందర్బంగా వారు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. సుశాంత్ తో ఉన్న సంబంధం ఆ తర్వాత గొడవ యూరప్ వెళ్లిన సమయంలో జరిగిన ఘటనలు మరియు ఇతరత్ర విషయాలపై లోతుగా రియాను సీబీఐ వారు ఎంక్వౌరీ చేయడం జరిగింది. మళ్లీ మళ్లీ కూడా రియాను సీబీఐ వారు విచారించే అవకాశం ఉందంటున్నారు. నిన్న రాత్రి పొద్దు పోయాక సీబీఐ వారి విచారణ పూర్తి చేసుకుని రియా మరియు ఆమె సోదరుడు షోవిక్ తో కలిసి ముంబయి శాంతాక్రాజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ తన వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఫిర్యాదు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మీడియా వారు ఆమె ఇంటిని చుట్టుముట్టి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారి నుండి రక్షణ కోసం ఆమె ఫిర్యాదు చేసిందనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.