కాజల్‌ పై మోజుతో 60 లక్షలు పోగొట్టుకున్నాడు

Update: 2019-08-01 12:29 GMT
ఆన్‌ లైన్‌ మోసాలు భారీగా పెరిగి పోతున్నా కూడా జనాలు కాస్త జాగ్రత్తగా ఉండటం లేదు. చాలా మంది ఇంకా ఆన్‌ లైన్‌ మోసాలకు గురవుతున్నారు. బాగా చదువుకున్న వారు కూడా ఈ మోసాలకు గురవ్వడం ఆశ్చర్యం. తాజాగా కాజల్‌ ను విపరీతంగా అభిమానించే వ్యక్తి నుండి సైబర్‌ నేరగాళ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.60 లక్షల రూపాయలను లాగారు. అతడి వీక్‌ నెస్‌ ను వారు క్యాష్‌ చేసుకుంటూ లక్షలు గుంజారు. ఇంకా వారి వేదింపులకు తట్టుకోలేక ఇంటి నుండి ఆ వ్యక్తి పారిపోయాడు. పోలీసుల రంగ ప్రవేశంతో అసలు విషయం బయటకు వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... తమిళనాడుకు చెందిన బాగా డబ్బున్న ధనవంతుడి కొడుకుకు కాజల్‌ అంటే చాలా అభిమానం. ఒక రోజు అతడు బ్రౌజింగ్‌ చేస్తున్న సమయంలో మీకు ఇష్టమైన స్టార్‌ ను కలిసే అవకాశం అంటూ ఒక యాడ్‌ కనిపించిందట. ఆ యాడ్‌ కు ఆకర్షితుడు అయిన అతడు క్లిక్‌ చేసి తన డిటైల్స్‌ ఇచ్చాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి నుండి కాల్‌.. ఛాటింగ్‌ వచ్చింది. కాజల్‌ ను కలవాలని ఉంది అంటూ ఇతడు చెప్పాడు. అందుకోసం వారు 50 వేల రూపాయలతో మొదలు పెట్టారు. ఆ తర్వాత ఫొటోలను, పర్సనల్‌ ఫొటోలను కూడా అడిగారు.

కాజల్‌ ను కలిపిస్తారనే ఉద్దేశ్యంతో వారు అడిగిన విషయాలన్ని చెప్పాడు. దాంతో అతడిని వారు బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టారు. అశ్లీల ఫొటోలను మార్ఫింగ్‌ చేయడంతో పాటు వాటిని బయట పెడతామంటూ బెదిరించి డబ్బులు లాగారు. మొత్తం 60 లక్షల రూపాయలను వారికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇంకా డబ్బు వారు డిమాండ్‌ చేస్తుండటంతో ఇక తనవల్ల కాదని ఇంటి నుండి పారిపోగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News