అందరివాడులో కుర్ర చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించిన రిమ్మీసేన్ కొత్త పాత్రలోకి ఎంటర్ అవుతోంది. మన కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్.. బేబక్కాయ్ అంటూ పిలిచాడే.. ఆ భామే ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీషోలో ప్రవేశిస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ 9వ సిరీస్ జరుగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఈ షోని నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్న సమయంలో... చిరు మాజీ హీరోయిన్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అవడంతో.. ఆసక్తి రేకెత్తించింది.
అప్పట్లో ధూమ్ - హంగామా - ఫిర్ హెరాఫెరీ అంటూ మంచి హిట్స్ తో సందడి చేసిన రిమ్మీసేన్.. 2009 తర్వాత సడెన్ గా మాయమయిపోయింది. తిరిగి 2011లో రీఎంట్రీ ఇచ్చి కొన్ని ప్రాజెక్టులు చేసిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. పాత వైభవాన్ని అందుకోవడం కుదరలేదు రిమ్మీకి. దీంతో డైరెక్టర్ గా మారేందుకు సిద్ధమయిపోయింది ఈ 34 ఏళ్ల భామ. ఇందుకోసం స్క్రీన్ నేమ్ రిమ్మీసేన్ ని వదిలేసి... ఒరిజినల్ నేమ్ శుభోమిత్రా సేన్ తో సినిమాలు తీస్తుందట. అయితే.., ఇలా కొత్త పాత్రలో రీఎంట్రీ ఇచ్చేందుకు సరైన ప్రచారం కావాలి. అలాంటి సమయంలో బిగ్ బాస్ హౌజ్ నుంచి పిలుపు రావడంతో వెంటనే వాలిపోయింది.
ఈ షో ఆధారంగా తన కాన్సెప్ట్ ని, ట్యాలెంట్ ని జనాలకు కొద్దికొద్దిగా పరిచయం చేయబోతోందింట. ఇఫ్పటికే బిగ్ బాస్9లో యువిక చౌదరి, మిస్ ఇండియా రొచెల్లీ మరియాలాంటి సుందరీమణులు పోటీలో ఉన్నారు. వీళ్లతో రిమ్మీ సేన్ అదే.. శుభోమిత్రాసేన్ కి గట్టి పోటీ తప్పదు. ఎనీవే.. బెస్టాఫ్ లక్.. బేబక్కా...య్.