మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ గా నటించిన రిమిసేన్ గుర్తుకు వచ్చిందా? ఆ నాజూకు భామ తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. పశ్చిమబెంగాల్ కు చెందిన ఈ భామ.. తెలుగుతో పాటు.. హిందీ.. బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. బెంగాల్ నుంచి ముంబయికి షిఫ్ట్ అయిన ఆమె.. సినిమా రంగంలో కొనసాగుతున్నారు.
హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం అందరి దృష్టిలో పడేలా చేస్తోంది. మరి.. సినిమాల్లో ఓ మోస్తరుగా సక్సెస్ అయిన ఆమె.. పాలిటిక్స్ లో ఎంతలా సక్సెస్ అవుతుందో చూడాలి. మొత్తానికి కమలదళంలో మరో గ్లామర్ హీరోయిన్ చేరిపోయిందన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/