బాలీవుడ్‌ సినిమాల‌పై 'కాంత‌ర‌' ఫేమ్ ఏమ‌న్నాడో తెలుసా?

Update: 2022-11-09 07:04 GMT
క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో రూపొందిన సంచ‌ల‌న సినిమా 'కాంతార‌'. సంస్క్రృతి, సంప్ర‌దాయాలకు పెద్ద పీట వేస్తూ క‌ర్ణాట‌కలో ప్ర‌చూర్యం పొందిన భూత‌కోల నేప‌థ్యంలో ఈ మూవీని ద‌ర్శ‌క‌హీరో రిష‌బ్ శెట్టి తెరకెక్కించిన విష‌యం తెలిసిందే. 'కేజీఎఫ్‌' మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ క‌న్న‌డ‌లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఆ త‌రువాత తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌ల చేశారు.

తెలుగులో ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ ఊహ‌కంద‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. ఏకంగా తెలుగులో దాదాపు రూ. 40 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం.. అదే స్థాయిలో హిందీ మార్కెట్ లోనూ రికార్డులు తిర‌గ‌రాయ‌డంతో ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు సినీ విశ్లేష‌కులు అవాక్క‌వుతున్నారు. ఎలాంటి స్టార్ కాస్ట్ లేని ఈ మూవీకి దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ మ‌ధ్య కాలంలో ఈ స్థాయిలో ప్రేక్ష‌కులు రికార్డు స్థాయిలో ఆక‌ట్టుకున్న సినిమా ఇదే అన‌డంతో ఎలాంటి సందేహం లేదు. మ‌రీ ఇంత‌గా ఈ సినిమాని ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం నేటివిటి. మ‌న మూలాల‌ని చూపించిన క‌థ‌, క‌థ‌నాలు, పాత్ర‌ల‌కు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ కావ‌డ‌మే ఈ సినిమాకు భారీ విజ‌యాన్ని అందించింది. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించేలా చేసింది. తెలుగుతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో సంచ‌ల‌నాలు సృష్టించిన ఈ మూవీ హిందీ బెల్ట్ లోనూ అదే స్థాయిలో  బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టిస్తూ బాలీవుడ్ సినిమాల‌ని, బాలీవుడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

బాలీవుడ్ లోనూ ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డానికి గ‌ల కార‌ణం ఏంట‌ని హీరో, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టిని ప్ర‌శ్నిస్తే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిజాల్ని బ‌య‌ట‌పెట్టాడు. బాలీవుడ్ సినిమాల్లో అత్యధికంగా పాశ్చ‌పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. అంతే కాకుండా హాలీవుడ్ త‌ర‌హాలో సినిమాలు చేయ‌మాల‌ని వారిన కాపీ కొడుతున్నారు. ఇదే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డం లేదు. హాలీవుడ్ ని ఫాలో అవ్వాల‌నే ఆలోచ‌న‌తో య‌న మూల‌ల‌ని మ‌రిచిపోతున్నారు. అదే పెద్ద ఇబ్బందిగా మారి  ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు' అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

అంతే కాకుండా హాలీవుడ్ సినిమాల‌ని ప్ర‌జ‌లు చూస్తున్నారు. అలాంటి క‌థ‌ల్నే మ‌న మేక‌ర్స్ అందివ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఆ స్థాయి క్వాలిటీ, కంటెంట్ లేక‌పోవ‌డంతో ఫెయిల్ అవుతున్నారు. అలా కాకుండా మ‌న ప‌ల్లెల్లో ఎన్నో క‌థ‌లు వున్నాయి. వాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తే బాగుంటుంద‌ని నా  క‌థ‌ల్ని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తే బాగుంటుంది. మ‌రిన్ని కొత్త క‌థ‌లు పుట్టుకొస్తాయి' అని తెలిపాడు. మ‌రి రిష‌బ్ శెట్టి చెప్పిన మాట‌ల్ని ఎంత మంది మేక‌ర్స్ ఆచ‌రిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News