రిషబ్ శెట్టి.. `కాంతార` మూవీతో టాక్ ఆఫ్ ది ఇండియా అవుతున్నాడు. కన్నడ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల దుమ్ముదులుపుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా వివడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ఈ మూవీ డివైన్ బ్లాక్ బస్టర్ గా మౌత్ టాక్ తో రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. `కేజీఎఫ్` మేకర్స్ హోంబలే ఫిలింస్ రూ. 16 కోట్లతో నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది.
ఊహించని విధంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి తెలుగులోనూ అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. తెలుగులో గత శనివారం విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ. 22 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చేస్తున్న రాంపేజ్ ని చూసి టాలీవుడ్ మేకర్స్ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందీతో పాటు తమిళంలోనూ ఈ మూవీ అతే జోరుని చూపిస్తూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది.
దీంతో ఈ మూవీలో నటించి, తెరకెక్కించిన రిషబ్ శెట్టి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాడు. దర్శకుడిగా `కిరిక్ పార్టీ`, నటుడిగా `గరుడ గమన వృషభ వాహన` మూవీలతో పాపులర్ అయిన రిషబ్ శెట్టి తాజాగా `కాంతార`తో ఊమించని విధంగా సంచలనం సృష్టిస్తున్న తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దీంతో అతని గురించి ఎవరీ రిషబ్ శెట్టి.. ఏమా అతని కథ అంటూ చాలా మంది గూగుల్ చేస్తున్నారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల తరువాత తను చేసిన `కాంతార` నిలవడంతో అంతా ఇప్పడు రిషబ్ శెట్టి గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో రిషబ్ శెట్టి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రిషబ్ శెట్టికి పెళ్లైంది. ఓ కుమారుడు కూడా వున్నాడు. భార్య పేరు ప్రగతి శెట్టి. వీరిది ప్రేమ వివాహం అని తెలిసింది. 2016లో రిషబ్ శెట్టి, ప్రగతిల పరిచయం ఓ కన్నడ సినిమా ఈవెంట్ సాక్షిగా జరిగిందట. రిషబ్ హీరో రక్షిత్ శెట్టితో ఓ మూవీ చేశాడు. తనకు వీరాభిమాని అయిన ప్రగతి అక్కడే రిషబ్ కు పరిచయం కావడంతో తన గురించి ఆలోచించడం మొదలు పెట్టాడట.
ఆ తరువాత ఇంటికి వెళ్లిన రిషబ్ ఫేస్ బుక్ లో సెర్చ్ చేయడం తో ప్రగతి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినట్టుగా కనిపించడం..దానిని ఓకే చేయడం జరిగిందని అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఛాటింగ్ లు మొదలయ్యాయని ఆ తరువాత వారి స్నేహం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట. అయితే ప్రగతి వాళ్ల ఫ్యామిలీకి రిషబ్ నచ్చలేదట. కారణం సినిమా నటుడు కావడమే. అయితే ప్రగతి ఇంట్లో వాళ్లని ఫోర్స్ చేయడంతో 2020లో వీరి పెళ్లి జరిగిందట. వీరికిప్పుడు ఓ కుమారుడున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.