రిష‌బ్ శెట్టి సెన్సేష‌న్ 'కాంతార‌' చుట్టూ ముదురుతున్న‌ వివాదం!

Update: 2022-10-25 06:51 GMT
రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన క‌న్న‌డ‌ మూవీ 'కాంతార‌'. 'కేజీఎఫ్‌' మేక‌ర్స్ హోబలే ఫిలింస్ అథినేత విజ‌య్ కిర‌గందూర్ ఈ మూవీని నిర్మించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా క‌న్న‌డ‌లో విడుద‌లైన ఈ మూవీ అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టించింది. దీంత ఈ మూవీని తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌ల చేశారు.

క‌న్న‌డ వెర్ష‌న్ ప్ర‌పంచ వ్యాప్తంగా వంద కోట్లు వ‌సూళు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తెలుగులోనూ ఈ మూవీ రూ. 22 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా ఇప్ప‌టీ కి వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లోనే కాకుండా త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. రానున్న రోజుల్లో ఈ మూవీ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రిన్ని రికార్డులు సాధించ‌డం ఖాయం అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ సినిమా చుట్టూ కాపీ వివాదం అలుముకుంటోంది. 'కాంతార‌'కు హీరో రిష‌బ్ శెట్టి వేసిన భూత‌కోల గెట‌ప్, 'వార‌హ రూపం.. దైవ వ‌రిష్టం.. అంటూ సాగే పాట‌, క్లైమాక్స్ స‌న్నివేశాలు హైలైట్ గా నిలిచి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణాలుగా నిలిచిన విష‌యం తెలిసిందే.

అయితే ఇందులోని 'వార‌హ రూపం.. దైవ వ‌రిష్టం.. అంటూ సాగే పాట చుట్టూ వివాదం చుట్టుకుంటోంది. ఈ పాట కాపీ అంటూ మ‌ల‌యాళంకు చెందిన 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ వారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

తాము విడుద‌ల చేసిన 'న‌వ‌ర‌స‌' ని కాపీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఈ వీడియో సాంగ్ లోని ప్ర‌తీ ప‌దాన్ని.. మ్యూజిక్ ని కూడా 'కాంతార‌'...''వార‌హ రూపం.. దైవ వ‌రిష్టం.. అంటూ సాగే పాట‌కు యాజిటీగ్ గా విడుకుని కాపీ చేయ‌డంతో 'కాంతార‌' బృందంపై 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ వారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

మ‌ల‌యాళంలో 'న‌వ‌ర‌స‌' పేరుతో 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ ను సంగీత ద‌ర్శ‌కుడు గోవింద్ వ‌సంత, గాయ‌కుడు సిద్ధార్ధ్ మీన‌న్ స్థాపించార‌ట‌. మ‌రి వీరి ఆరోప‌ణ‌ల‌కు 'కాంతార‌' టీమ్ ఎలా స్పందిస్తుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View

Full View


Tags:    

Similar News