జెనీలియా భ‌ర్త‌ వింత వేషం చూశారా?

Update: 2020-03-04 05:30 GMT
బొమ్మ‌రిల్లు హాసిని జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు ఇద్ద‌రు కిడ్స్ కూడా ఉన్నారు. రితేష్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా స్లో అయ్యాడు ఎందుక‌నో. గతేడాది `మర్జావాన్‌`లో నెగటివ్‌ రోల్‌ పోషించి ఆకట్టుకున్నాడు. కొంత గ్యాప్ త‌ర్వాత‌ వినోదాత్మక పాత్ర‌ లో మెప్పించారు. ప్ర‌స్తుతం రితేష్ న‌టిస్తున్న సినిమా గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

తాజాగా రితేష్ కొత్త గెట‌ప్ ప‌రిశ్ర‌మ‌లోనూ చ‌ర్చ‌కొచ్చింది. దీనిపై కొంద‌రు నెటిజ‌నులు నెగటివ్‌ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఆ స‌ర్ ప్రైజ్ గెటప్ ని చూసి ప‌లువురు చులకగా కామెంట్స్ చేశారు. అయితే రితేష్‌ కూడా అంతే సెటైరికల్ గా.. ఫన్నీగా రిప్లై ఇచ్చి ఆశ్చర్య పరిచారు. మరి ఇంతకీ ఆ కామెంట్స్ దేనికి అంటే.. రితేజ్‌ ఇటీవల కొత్త‌ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఇందులో బ్లూ డ్రెస్‌ ధరించి గెడ్డం స్టైల్ మార్చాడు. పైగా గ్రే కలర్ జుత్తు.. షార్ట్ హెయిర్ తో వెరైటీగానూ క‌నిపించాడు. ఆ వేషానికి త‌గ్గ‌ట్టే కూల్‌ గ్లాస్‌ పెట్టుకుని కొత్తగా కనిపించారు. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే త‌న‌కు తెలిసిన ఓ సన్నిహితుడు రితేష్ ని ప్రముఖ మ్యూజీషియన్‌ డీజే స్నేక్ తో పోల్చుతూ చులకన చేసినట్టుగా ట్వీట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రితేష్ కి బాగా కాల‌డంతో ఆ కామెంట్ కు అదే రేంజ్‌లో రీప్లై ఇచ్చారు.

`బ్రదర్‌ నేను చీప్‌ కాదు. నాగపంచమికి బుక్‌ చేసుకో. ఫ్రీగా వస్తా` అంటూ తనదైన స్టయిల్ లో రీట్వీట్‌ చేశారు. దీంతో దెబ్బకు సదరు వ్యక్తి తన ట్వీట్ ని వెనక్కి తీసుకున్నారు. మరి రితేష్‌ నాగుల పంచమి నాగిని డాన్స్ వేస్తాడా? ఇక కామెడీ తరహా పాత్రలతో అలరించే రితేష్‌ దేశ్‌ముఖ్‌ ప్రస్తుతం టైగర్ ష్రాఫ్‌- శ్రద్ధ కపూర్‌ జంటగా నటిస్తున్న `బాఘి 3`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రితేష్‌ మన `బొమ్మరిల్లు` భామ జెనీలియా భర్త కాబ‌ట్టి అత‌డికి సంబంధించిన విష‌యాల‌పై ఇక్క‌డా ఆస‌క్తి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News