తెరపై ఒక హీరోయిన్ గా కాకుండా కాలనీలో కళ్లముందు తిరిగే అమ్మాయిలా సహజంగా నటించడం రీతూ వర్మ ప్రత్యేకత. 'బాద్ షా' సినిమాలో ఒక పాత్రలో మెరిసిన రీతూ వర్మ, నిదానంగా కథానాయికగా అవకాశాలను అందుకోగలిగింది. 'ఎవడే సుబ్రమణ్యం' .. ' పెళ్లి చూపులు' వంటి విభిన్నమైన కథాంశాలను కలిగిన సినిమాలలో అవకాశాలు లభించడం ఆమె చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ గా కనిపిస్తూ .. పాత్ర పరిధి దాటకుండా ఆమె చేసే నటన పట్ల అంతా ఆకర్షితులయ్యారు.
ఆ తరువాత తెలుగులో ఆమె చేసిన 'కేశవ' సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా, తమిళంలో చేసిన 'కనులు కనులను దోచాయంటే' సినిమా అక్కడ ఆమె కెరియర్ కి మంచి హెల్ప్ అయింది. ఏకంగా విక్రమ్ సరసన 'ధృవ నక్షత్రం'లో చేసే అవకాశాన్ని దక్కించుకోగలిగింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా విడుదలైతే అక్కడ మరింత మాజీ కావడం ఖాయమనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది.
ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న రెండు సినిమాలు కూడా మంచి అంచనాలు ఉన్నవే. నాని కథానాయకుడిగా చేసిన 'టక్ జగదీష్'లో రీతువర్మ నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది., గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె 'గుమ్మడి వరలక్ష్మీ' పాత్రలో కనిపించనుంది. ఆ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఇక 'వరుడు కావలెను' సినిమాలో ఆమె నాగశౌర్య సరసన అలరించనుంది.
లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె కాస్త మోడ్రన్ గానే కనిపించనుంది. ఈ సినిమా కూడా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందనే ఆశతోనే ఉంది. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. తప్పకుండా ఈ సినిమాలు హిట్ అవుతాయనే ఆమె భావిస్తోంది. ఈ రెండు సినిమాల నుంచి ఇంతవరకూ వచ్చిన ఫొటోలు .. టీజర్లు చూస్తుంటే, రీతూ వర్మ నమ్మకం నిజమయ్యేలానే అనిపిస్తోంది మరి.