శంకర్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రూపొందిన ‘2.ఓ’ చిత్రంకు భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఈ చిత్రం భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తుందని అంతా భావించారు. 550 కోట్ల బడ్జెట్ తో నిర్మితం అయిన ఈ చిత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా ప్రచారం జరిగింది. కాని పరిస్థితి తలకిందులు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 2.ఓ చిత్రాన్ని 2డి మరియు 3డి వర్షన్ లలో విడుదల చేశారు.
మొదటి నుండి 2.ఓ చిత్రంను 3డి లో చూస్తే సరికొత్త ప్రపంచంలో విహరించిన అనుభూతి కలుగుతుందనే ప్రచారం జరిగింది. దాంతో చూస్తే 2.ఓ ను 3డిలోనే చూడాలి, లేదంటే వద్దు అన్నట్లుగా ప్రేక్షకుల మూడ్ మారిపోయింది. ఇండియాలో అత్యధికంగా 2డిలో విడుదలైన ఈ చిత్రం అక్కడక్కడ మాత్రమే 3డిలో రిలీజ్ అయ్యింది. 3డి వర్షన్ ఉన్న థియేటర్ లు అయిదవ రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. కాని 2డి వర్షన్ ఉన్న థియేటర్లు మాత్రం వెలవెలబోతున్నాయి.
2డి వర్షన్ ప్రదర్శితం అవుతున్న థియేటర్లలో సోమవారం నుండి కలెక్షన్స్ మరీ దారుణంగా పడిపోయాయట. కొన్ని థియేటర్లలో షోలను కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉందని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2.ఓకు ఇలాంటి పరిస్థితి వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఊహించలేదు. 3డికి ఎక్కువ ప్రచారం చేయడంతో భారీగా నష్టం ఏర్పడినది. 2డి వర్షన్ పై ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపక పోవడంతో బాహుబలి సినిమా కలెక్షన్స్ ను క్రాస్ చేయడం పక్కన పెట్టి, బ్రేక్ ఈవెన్ అయినా చేరేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.