రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 2.ఓ. రోబోకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఒక్క సినిమాకు ఏకంగా 450 కోట్ల రూపాయలు వెచ్చించడమే సంచలనం అయిపోతోంది. రీసెంట్ గా ఆడియో ఫంక్షన్ నిర్వహణకే 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసేశారు.
ప్రస్తుతం 2.ఓ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడీ మూవీ టీజర్ రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్ ను విడుదల చేయనున్నారట. వచ్చే ఏడాది జనవరి 26న గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి మరీ.. 2.ఓ మొదటి టీజర్ ను లాంఛ్ చేయనున్నారు. ఈ సినిమాకు ప్రచారం కూడా ఎక్కువగానే చేయనుండగా.. పలు టీజర్స్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. నిజానికి జనవరి 25న సౌతిండియా సూపర్ స్టార్ నటించిన ఈ మూవీనే రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు టీజర్ తో సరిపెట్టేస్తున్నారు.
ముందుగా అనుకున్న వెర్షన్స్ కు తోడు 3డీ వెర్షన్ ను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించడం.. మధ్యలో బాహుబలి2 సాధించిన అసాధారణ విజయం కారణం.. గ్రాఫిక్స్ క్వాలిటీపై మరింతగా శ్రద్ధ వహించాల్సి వచ్చింది. అందుకే ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఏప్రిల్ 14న తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా 2.ఓ మూవీ విడుదల చేయాలని నిర్ణయించాడు శంకర్.