లింగా.. ఈ పేరెత్తితో చాలు.. అటు తమిళంలో, ఇటు తెలుగులో డిస్ట్రిబ్యూటర్లు బెంబేలెత్తిపోతారు. ఎన్నో ఆశలతో భారీ రేట్లు పెట్టి ఈ సినిమాను కొన్న బయ్యర్లకు దారుణమైన అనుభవం మిగిలింది. సగానికి సగం నష్టపోయి నిలువునా మునిగారు బయ్యర్లు. ఐతే నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాత్రం పెట్టుబడి మీద రెట్టింపు జేబులో వేసుకుని బాగా లాభపడ్డాడు. తమిళనాట డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేస్తే నష్టాల్లో ఏ పది శాతమో తిరిగి చెల్లించాడు కానీ.. అది పెద్ద సాయమేమీ కాదు. ఇక తెలుగు బయ్యర్ల సంగతి మాత్రం పట్టించుకోలేదు. దీంతో రెండు చోట్లా బయ్యర్లు రాక్ లైన్ పేరు చెబితే మంటెత్తిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రజినీ తన కొత్త సినిమా ‘కబాలి’కి రాక్ లైన్ డిస్ట్రిబ్యూటర్ గా మారడం తోటి డిస్ట్రిబ్యూటర్లకు కాక తెప్పిస్తోంది. ఈ చిత్రాన్ని కన్నడ నాట అతనే రిలీజ్ చేస్తున్నాడు. నాన్-కన్నడ సినిమాల్లో రికార్డు రేటు పెట్టి ఈ సినిమాను కొన్నాడు రాక్ లైన్. రూ.4 కోట్లకు హక్కుల్ని సొంతం చేసుకున్నాడట అతను. ‘కబాలి’ హక్కుల్ని చాలా వరకు ‘లింగా’ బయ్యర్లకే వచ్చేలా చూశాడు రజినీ. ఐతే డిస్ట్రిబ్యూటర్లు రాక్ లైన్ పేరెత్తితేనే మండిపోతున్న టైంలో మళ్లీ అతడికి రజినీ తన కొత్త సినిమాలోనూ భాగస్వామ్యం కల్పిస్తుండటం చాలామందికి నచ్చట్లేదు. ఐతే రజినీతో ఉన్న స్నేహం వల్ల.. పైగా రికార్డు రేటు పెట్టడంతో నిర్మాత కలైపులి థాను కాదనలేకపోయాడు. జులై 1న ‘కబాలి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.