టాలీవుడ్ లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శ్రీమంతుడు రీమేక్ రైట్స్ కోసం చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు - శృతిహాసన్ జంటగా కొరటాల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని.. హిందీలో పునర్ నిర్మించేందుకు.. వయాకామ్ - ఈరోస్ వంటి సంస్థలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ నిర్మాత మాత్రం శ్రీమంతుడిపై మనసు లేదంటున్నాడు.
ఇప్పటికే కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో భజరంగీ భాయిజాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీశాడు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్. మళ్లీ సల్లూభాయ్ తో సినిమాకి సిద్ధంగానే ఉన్నా.. శ్రీమంతుడు చిత్రాన్ని మాత్రం తీసేందుకు సిద్ధంగా లేడట. ఈ స్టోరీ సౌత్ కి సెట్ అవుతుంది కానీ.. ఉత్తరాదిలో ఈ తరహా స్టోరీలకు ఆదరణ ఉండదన్నది ఆయన వాదన. అందుకే సొంతగానే స్టోరీలు రెడీ చేసుకుంటున్నానని చెబ్తున్నాడు.
బాలీవుడ్ లో వరుసగా ప్రాజెక్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్న రాక్ లైన్ వెంకటేష్.. ప్రస్తుతం రెండు స్టోరీలను సిద్ధం చేయిస్తున్నాడు. వీటిలో ఒకటి ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది కూడా. దీన్ని త్వరలోనే సల్మాన్ కి వినిపించి.. గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలన్నది ఆయన యోచన. అంతా ఓకే అయితే.. 2016 జూన్ నాటికి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.