రజనీకాంత్‌ను ఆపేందుకే ఈ కుట్ర

Update: 2015-01-20 13:30 GMT
'వచ్చే ఏడాది తమిళనాడులో ఎలక్షన్లు ఉన్న మాట వాస్తవమే. అందుకే ఇప్పుడు ఆయన్ను రాజకీయాల్లోకి రానీయ కూడదని కొన్ని శక్తులు ఆయనకు వ్యతిరేకంగా ఏకమై కృషి చేస్తున్నాయి. వారే ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలా డిస్ట్రిబ్యూటర్లతో రగడ చేయిస్తున్నారు'' అంటూ ఆరోపించారు ''లింగా'' సినిమా నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌. గత ఏడాది డిసెంబర్‌ 12న రజనీ పుట్టినరోజు సందర్భంగా ''లింగా'' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఫ్లాప్‌ కావడంతో, తమిళనాట కొందరు డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్షను చేపట్టారు. నిర్మాత తమకు డబ్బులు తిరిగి ఇవ్వట్లేదని, అలాగే రజనీకాంత్‌ కూడా ఇందులో తలదూర్చడం లేదంటూ ఆరోపిస్తూ ట్రిచీ నగరానికి చెందిన ఓ పంపిణీదారుడు చెన్నయ్‌లో నిరాహారదీక్ష చేస్తున్నారు. దీనిపై స్పందించిన లింగా నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌, కేవలం రజనీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పైగా ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఉండేందుకే ఇలా ఆయన్ను ఇరకాటంలో పడేస్తున్నారంటూ రజనీ ప్రొడ్యూసర్‌ ఆరోపించడం షాకింగ్‌గా ఉంది.
Tags:    

Similar News