రాక్‌లైన్ వెంకటేష్‌ను తెలుగు ఆడియన్స్ అంత ఈజీగా మరిచిపోలేరు. 'పవర్' సినిమాతో టాలీవుడ్‌లోకి నిర్మాతగా పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ సీనియర్ ప్రొడ్యూసర్ 'లింగా' సినిమాతో మన జనాలకు చేదు అనుభవాన్ని కూడా మిగిల్చాడు. ఆర్నెల్లకు పైగా 'లింగా' తలనొప్పుల్ని భరించిన రాక్‌లైన్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో 'భజరంగి భాయిజాన్' అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథను డైరెక్టర్ కబీర్‌ఖాన్, సల్మాన్‌ల దగ్గరికి తీసుకెళ్లింది వెంకటేషే. ఇంత మంచి కథ తెచ్చాడన్న అభిమానంతో అతడి నిర్మాణంలోనే సినిమా చేస్తున్నాడు సల్మాన్.
అనుకోకుండా ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రాక్‌లైన్.. మున్ముందు కూడా బాలీవుడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాడు. భజరంగి భాయిజాన్ తర్వాత తెలుగులో డిజాస్టర్‌గా నిలిచిన ఓ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు రాక్‌లైన్. అదే.. గడ్డం గ్యాంగ్. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజై దారుణమైన ఫలితం చవిచూసింది. ఐతే దీని తమిళ మాతృక 'సూదుకవ్వం' అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ జనాల టేస్టుకు తగ్గట్లు తీర్చిదిద్దుతామని చెబుతున్నాడు రాక్‌లైన్. మరి తమిళంలో బ్లాక్‌బస్టరై, తెలుగులో డిజాస్టర్‌గా మిగిలిన సినిమా హిందీలో ఎలాంటి ఫలితాన్ని చూస్తుందో?