'రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌' ని నగ్నంగా కూర్చోబెట్టిన పోలీసులు...!

Update: 2020-08-08 09:50 GMT
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఈ మధ్య వరుసగా సెటైరికల్ మూవీస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ సినిమాకి సినిమాతోనే సమాధానం చెప్పాలని డిసైడైన కొందరు వ్యక్తులు అతన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీ సినిమాలు తీసే ఆర్జీవీపై రివేంజ్ తీర్చుకునే క్రమంలో ఇప్పటికే ''పరాన్నజీవి'' అనే సినిమా రిలీజ్ చేసారు. దీంతో పాటు ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 'ఆర్జీవీ' (రోజూ గిల్లే వాడు) అనే సినిమా తీస్తున్నారు. ఇక సంజీవ్ రెడ్డి ''పార్న్ జీవి - పెళ్ళాం వదిలేసిన ఒక దర్శకుడి కథ'' అనే మరో సినిమా కూడా అనౌన్స్ చేసారు. వర్మని టార్గెట్ చేస్తూ 'ఎవడ్రా నన్ను కొట్టింది' అనే సినిమా కూడా ప్రకటించారు. ఈ క్రమంలో లేటెస్టుగా 'రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌' అనే మరో సినిమా రానుంది.

''రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌'' టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇది 'శివ' కి ముందు జరిగిన కథ అని ప్రకటించారు. ఇంకా దీనిలో వోడ్కా బాటిల్ తో పాటు ఓ ఐరన్ రాడ్ ని కూడా పొందుపరిచారు. అంతేకాకుండా దీనికి 'పలు బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముతున్న యువకుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు' అనే శీర్షికతో ఉన్న పేపర్ కటింగ్‌ ను పోస్టర్‌లో జతచేసారు. పోలీస్ స్టేషన్ లో నగ్నంగా కూర్చున్న వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ రెండు కాళ్ల మధ్య నుంచి చూపించేలా పోస్టర్ డిజైన్ చేసారు. మొదటి చాప్టర్ గా రానున్న ఈ చిత్రాన్ని కె.ఎస్.మణి రూపొందిస్తున్నారు. 'ఆ రోజు రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఈ ఫిక్షనల్ రియాలిటీ ఫిలింను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. త్వరలోనే ట్రైలర్ వచ్చేస్తుంది' అని ప్రకటించారు.

కాగా ఇప్పటి దాకా అందరూ వర్మని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసినప్పటికీ.. ఈ మూవీలో శివ కి ముందు జరిగిన స్టోరీని చెప్తాం అని ప్రకటిచడంతో అందరిలో ఆసక్తి మొదలైంది. అందులోనూ రామ్ గోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు పంజాగుట్ట‌లో సీడీ షాపు నిర్వహించేవాడనే విషయం అందరికి తెలిసిందే. మరి ఈ సినిమాలో వర్మ గురించి ఏమి చూపిస్తారో చూడాలి. మరో వైపు ఆర్జీవీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ''ఆర్జీవీ మిస్సింగ్'' మరియు ''అల్లు'' అనే ఫిక్షనల్ రియాలిటీ సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మొత్తం మీద ఈ కరోనా సమయంలో ఆర్జీవీ తీస్తున్న సినిమాలు.. ఆర్జీవీపై తీస్తున్న ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయని చెప్పవచ్చు.
Tags:    

Similar News