రోగ్ హీరోయిన్ని.. అంత టార్చర్ పెట్టాడా?

Update: 2017-03-11 11:12 GMT
సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక వచ్చిన తలనొప్పి ఇది. అందులో సెలబ్రెటీల్ని ఆరాధించేవాళ్లూ ఉంటారు. వాళ్ల మీద విషం కక్కే వాళ్లూ ఉంటారు. ఐతే ఆ సమయానికి ఏదో నోటికొచ్చినట్లు వాగేసే వాళ్లను పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అదే పనిగా టార్గెట్ చేసి విషం చిమ్ముతుంటే మాత్రం సెలబ్రెటీలకు కూడా అది పెద్ద తలనొప్పే. పూరి జగన్నాథ్ సినిమా ‘రోగ్’తో హీరోయిన్‌ గా పరిచయం కాబోతున్న ఏంజెలా కూడా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంది.

రాహుల్ ఖన్నా అనే వ్యక్తి ఆమెను తీవ్ర స్థాయిలో వేదనకు గురి చేశాడట. దాదాపు ఏడాది నుంచి అతను అదే పనిగా ఏంజెలాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశాడట. రాహుల్ తనకు తెలుసని.. ఐతే తనను అతనెందుకు అలా టార్గెట్ చేశాడో తెలియదని.. ఏడాది నుంచి అతడి వల్ల తీవ్ర మనో వేదనకు గురయ్యానని.. ఎన్నోసార్లు ఏడ్చానని.. ఇక టార్చర్ తీవ్ర స్థాయికి చేరడంతో పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఏంజెలా తెలిపింది. ఆమె ముంబయిలో సైబర్ క్రైమ్ పోలీసులకు రాహుల్ ఖన్నా మీద ఫిర్యాదు చేసింది.

ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాలో పేజీలో ఎమోషనల్ అయింది. ‘‘నన్ను నాశనం చేయడానికి అతను కంకణం కట్టుకున్నాడు. ఐతే నేనిప్పుడు అతణ్ని చట్టం సాయంతో నాశనం చేయదలుచుకున్నాను. అతడికి నేను ఏ చెడూ చేయలేదు. కానీ నన్నెందుకు అతను అంతగా ధ్వేషిస్తాడో నాకు తెలియదు. నేనతణ్ని అంతలా ఏం హర్ట్ చేశానో? నేనెంత ఏడ్చానో అతడికి తెలుసా? అతను చేసిన దుష్ప్రచారం వల్ల జనాలు నన్ను చాలా అపార్థం చేసుకున్నారు’’ అని ఆమె పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News