బాలీవుడ్ ని స‌మ‌ర్ధించ‌బోయ్ అడ్డంగా బుక్కైన రోహిత్ శెట్టి!

Update: 2022-12-23 05:13 GMT
రోహిత్ శెట్టి  ఈపేరు  విన‌గానే  'చెన్నై ఎక్స్ ప్రెస్'..'గోల్ మాల్' లాంటి  సినిమాలు  గుర్తొచ్చినా...అంత‌కుమించి ఇతనిపై సౌత్ సినిమాల  రీమేక్ డైరెక్ట‌ర్ అని ముద్రం బ‌లంగా  ఉంది. 'జ‌మీన్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన రోహిత్ శెట్టి అటుపై సౌత్ సినిమాలు రీమేక్ చేసి స‌క్సెస్ లు అందుకున్న దాఖ‌లాలే?  ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. 'సండే' టైటిల్ తో  అనుకోకుండా 'ఒక రోజు' రీమేక్ చేసాడు. సూర్య హీరోగా న‌టించిన 'సింగం'ని అదే టైటిల్ తో హిందీలోనూ అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా దించి రీమేక్ స‌క్సెస్ అందుకున్నాడు.

అటుపై  'సింగం రిట‌ర్న్స్' అంటూ మ‌ల‌యాళం సినిమా 'ఎల‌వావ‌య‌న్' రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. అటుపై 'టెంప‌ర్' చిత్రాన్ని 'సింబా' టైటిల్ తో రీమేక్ చేసి స‌క్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు 'సింగం ఎగైన్' అంటూ మ‌రో రీమేక్ కి రెడీ అవుతున్నాడు. ఇలా రోహిత్ కెరీర్ మొత్తం ప‌రిశీలిస్తే సౌత్ సినిమాలు రీమేక్ హిట్లు త‌ప్ప  సొంత క‌థ‌ల‌తో స‌త్తా చాటింది కొద్ది శాతంతోనే అన్న‌ది వాస్త‌వం.

తాజాగా బాలీవుడ్ బ్యాడ్ ఫేజ్ ని ఉద్దేశించి రోహిత్ శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు  చేసి అడ్డంగా  దొరికిపోయాడు. ప్ర‌తిగా సౌత్ జ‌నాల నుంచి ట్రోలింగ్ గుర‌య్యాడు. ఇంత‌కీ ఆయ‌న ఏం చేసాడో తెలియాలంటే?  విష‌యంలోకి వెళ్లాల్సిందే. కోవిడ్ ద‌గ్గ‌ర నుంచి బాలీవుడ్ కి స‌రైన హిట్ లేని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ ప‌నిత‌నాన్ని ఉద్దేశించి కొంద‌రు విమ‌ర్శించ‌గా.. మ‌రికొంత మంది ప‌రిశ్ర‌మ‌ని స‌మ‌ర్ధించారు.

బాలీవుడ్ పై వ‌స్తోన్న నెగివివిటీని త‌ట్టుకోలేక ఇలా గ‌త స‌క్సెస్ ల్ని గుర్తి చేసి  సొంత ప‌రిశ్ర‌మ‌ని స‌మ‌ర్ధించాడు. 'బాలీవుడ్  'షోలే'.. 'కుచ్ కుచ్ హోతా హై'.. 'గోల్‌మాల్'.. 'సూర్యవంశీ'  అనేక ఇతర బ్లాక్‌బస్టర్‌లను అందించింది. ఒక బ్యాడ్ ఫేజ్ కోసం బాలీవుడ్‌ని కించ ప‌రిచి మాట్లాడ‌టం తెలివైన పని కాదు' అని రోహిత్ శెట్టి అన్నారు. రోహిత్ ప్రకటన సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురైంది.

'ఈ వ్యక్తి సౌత్ హిట్‌లను ఫ్రీమేకింగ్ చేస్తున్నప్పుడు  ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడ‌లేక‌పోయాడు. అతను సౌత్ సినిమాపై ఆధారపడి జీవిస్తున్నాడు. కానీ ఇప్పుడు దానిని అంగీకరించలేకపోతున్నాడు' అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. 'రోహిత్ వ్యాఖ్య బాలీవుడ్ యొక్క విచారకరమైన స్థితిని  తెలియ‌జేస్తుంది. వారు ఎప్పుడు దక్షిణాది ఆధిపత్యాన్ని అంగీకరించలేరు.

వారే ఎప్పుడు మార్గ‌ద‌ర్శ‌కంగా కావాల‌ని చూస్తారు.  అది త‌ప్పుడు ఆలోచ‌న అయినా...అలాగే ఆలోచిస్తారు వాళ్లంతా.  మ‌రో  అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే..బాలీవుడ్ కి ఇప్పుడు సౌత్ సినిమా మైలు అంటుంకుంది. ఇది బాలీవుడ్‌కు మరింత నష్టాన్ని మిగిల్చింది' అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. 'రోహిత్  సౌత్ సినిమాల కంటెంట్‌ను స్క్రాప్ చేసి బాలీవుడ్ ప్రేక్షకులకు రీప్యాక్ చేస్తూ జీవిస్తున్నాడు.  అతను  భారతీయ సినిమా ట్రెండ్‌ను అర్థం చేసుకోలేకపోతున్నాడని' ప‌ల‌వురు నెటి  జ‌నులు అభిప్రాయ‌ప‌డ్డారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News