తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 మరో వారంలో ముగియబోతుంది. కొన్ని కారణాల వల్ల చివరి వారం ఎలిమినేషన్‌కు పార్టిసిపెంట్స్ మొత్తం నామినేట్ అయిన విషయం తెల్సిందే. అయితే కోడి గుడ్ల టాస్క్‌లో సామ్రాట్ గెలవడం వల్ల ఆయన ఎలిమినేషన్ నుండి ఇమ్యూనిటీ పొందాడు. ఫైనల్ కు వెళ్లిన మొదటి పార్టిసిపెంట్‌గా సామ్రాట్ నిలిచాడు. ఇక ఎలిమినేషన్స్ లో తనీష్ - కౌశల్ - రోల్ రైడా - దీప్తి - గీత మాధురి ఉన్నారు. ఈ అయిదుగురిలో ఒకరు ఎలిమినేట్ అయితే మిగిలిన నలుగురు ఫైనల్స్ కు వెళ్లనున్నారు.
బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయినప్పటి నుండి కూడా ఎలిమినేట్ అయిన వారు ఎవరు అనే విషయం ముందు రోజే తెలిసి పోతుంది. ఇక ఈ వారం కూడా ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలిపోయింది. నేడు ఎలిమినేషన్ పక్రియకు సంబంధించిన ఎపిసోడ్ నిన్ననే చిత్రీకరణ పూర్తి చేశారు. దాంతో ఎలిమినేట్ అయినది ఎవరో లీక్ అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రోల్ రైడా ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.
ఎలిమినేషన్స్ కు నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో దీప్తి మరియు రోల్ రైడా లు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా అంతా భావించారు. అయితే అనూహ్యంగా దీప్తికి మంచి ఓట్లు రావడంతో ఆమె సేఫ్ అయ్యి ఫైనల్ కు వెళ్లిందని, రోల్ రైడా బయటకు వచ్చేశాడు అంటూ సమాచారం అందుతుంది. ఇక ఫైనల్ లో తలపబోతున్న ఇంటి సభ్యులు కౌశల్ - తనీష్ - గీత మాధురి - సామ్రాట్ - దీప్తి. ఈ అయిదుగురిలో ఫైనల్ విజేత ఎవరు అనే విషయం వచ్చే వారం తెలిసి పోయే అవకాశం ఉంది. కౌశల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో అంతా కూడా కౌశల్ విజేత అనుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 2 లో ఏదైనా జరగొచ్చు అంటూ మొదటి నుండి అంటూ వస్తున్నారు. కనుక విజేత ఎవరైనా అవ్వొచ్చు అంటూ నిర్వాహకులు అంటున్నారు.