టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా సూపర్ సక్సెస్ అయినటువంటి ఎంఎస్ రాజు.. చాలకాలం తర్వాత ఈ ఏడాది దర్శకుడుగా 'డర్టీ హరి'తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఇదివరకు నిర్మాతగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ నిర్మించిన ఎంఎస్ రాజు ప్రస్తుతం దర్శకుడుగా యువతను దృష్టిలో పెట్టుకొని సినిమాలు రూపొందిస్తున్నారు. అయితే డర్టీ హరి తర్వాత రాజు తెరకెక్కిస్తున్న చిత్రం '7 డేస్ 6 నైట్స్'. టైటిల్ చూస్తేనే ఈ సినిమా కూడా ఈ కాలం యువతను బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది. అయితే లాక్డౌన్ ముగియడంతో సినిమా షూటింగ్స్ అన్ని మొదలవుతున్నాయి.
తాజాగా ఎంఎస్ రాజు కూడా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి మేకింగ్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోనే 7డేస్ 6 నైట్స్ మూవీ షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే షెడ్యూల్స్ గోవా.. మంగళూరు.. అండమాన్ లలో కూడా జరుపనున్నట్లు ప్రొడ్యూసర్ తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోలే ప్రొడ్యూసర్స్ అవుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఈ రొమాంటిక్ లవ్ మూవీతో ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ నిర్మాతగా మారుతున్నాడు.
ఈ సినిమాకు ఎంఎస్ రాజునే కథను కూడా అందించడం విశేషం. షూటింగ్ త్వరగా అయిపోతే సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ఇప్పటికి నటినటుల వివరాలు బయట పెట్టకుండానే షూటింగ్ చేసేస్తున్నారు రాజు. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. ఇదివరకు దేవిశ్రీప్రసాద్ ను ఇంట్రడ్యూస్ చేసిన ఎంఎస్ రాజు.. ఈసారి గొల్లపూడి సమర్థ్ అనే కుర్రాడికి అవకాశం ఇచ్చారు. ఇండస్ట్రీవర్గాల ప్రకారం.. సినిమాలో కాస్ట్ కూడా కొత్తవారే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. చూడాలి మరి ఈసారి డర్టీ హరి లాంటి మరో శృంగార నాటకం ఎలా చూపిస్తారో.. ఈ సినిమాను సుమంత్ అశ్విన్ - ఎస్ రజినీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.