పిక్ టాక్: అల్లు హీరో - అను బేబీ ఒకే బెడ్ మీద 'కలిసుంటే'..!

Update: 2022-10-22 08:15 GMT
'కొత్త జంట' 'శ్రీరస్తు శుభమస్తు' 'ఒక్క క్షణం' సినిమాలతో అలరించిన అల్లు శిరీష్.. కొంత గ్యాప్ తర్వాత ''ఊర్వశివో రాక్షసివో'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటించింది. రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

'ఊర్వశివో రాక్షసివో' సినిమాని నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హీరో అల్లు శిరీష్ పలు కాలేజీలను విజిట్ చేస్తూ తన సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు ఆన్ లైన్ ప్రమోషన్స్ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్ యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. 'దీంతననా'  మరియు 'మాయారే' వంటి సాంగ్స్ కూడా శ్రోతలను అలరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'కలిసుంటే' అనే మరో గీతాన్ని వదలడానికి రెడీ అయ్యారు.

'కలిసుంటే' పాటను ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా 'ఊర్వశివో రాక్షసివో' నుంచి ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో అల్లు శిరీష్ - అను బేబీ ఇద్దరూ ఒకే బెడ్ మీద పవళించి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు.

ఇదొక రొమాంటిక్ గీతమని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. 'కలిసుంటే' పాటకు అచ్చు రాజ‌మ‌ణి సంగీతం సమకూర్చారు. కేకే సాహిత్యం అందించగా.. అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ సాంగ్ కు విజయ్ కొరియోగ్రఫీ చేశారు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ధీరజ్ మొగిలినేని నిర్మింస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఎం సహ నిర్మాతగా వ్యవహారించారు. త‌న్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

నేటి యువతరానికి కనెక్ట్ అయ్యే అంశాలతో న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది తమిళ్ లో మంచి విజయం సాధించిన 'ప్రేమ ప్యార్ కాదల్' అనే సినిమా ఆధారంగా రూపొందింది. మరి ఈ సినిమా అల్లు శిరీష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News