యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ''అల్లుడు అదుర్స్'' ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు మూడు లిరికల్ వీడియో సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'అల్లుడు అదుర్స్' నుంచి నాల్గవ సాంగ్ 'నదిలా నదిలా' ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్ ని కాశ్మీర్ మంచు ప్రదేశాలలో షూట్ చేసినట్లు తెలుస్తోంది.
'నదిలా నదిలా నదిలా.. కదిలావే ఓ నదిలా.. అల లా అల లా తడిపావే నన్ను ఇలా..' అంటూ సాగిన ఈ పాటను దేవిశ్రీ తమ్మడు సాగర్ మరియు హరిప్రియ కలిసి ఆలపించారు. 'చక చకమంటూ నా మనసేపుడూ పరిగేడుతుందే నీ వైపే..' అంటూ లిరిసిస్ట్ శ్రీమణి క్యాచీ లిరిక్స్ అందించాడు. అందమైన స్నో ఫాల్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ కి చోటా కె. నాయుడు అందించిన విజవల్స్ బాగున్నాయి. ఇందులో సాయి శ్రీనివాస్ - నభా నటేష్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. కాగా, గంజి రమేష్ కుమార్ సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో నభా నటేష్ తో పాటు అనూ ఇమాన్యుల్ మరో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ - సోనూసూద్ - వెన్నెల కిషోర్ - సత్య - బ్రహ్మాజీ - సప్తగిరి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Full View