పాన్ ఇండియా RRR ని అక్టోబర్ రిలీజ్ లక్ష్యంగా జక్కన్న శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే చరణ్.. తారక్ లపై కీలక షెడ్యూళ్లను పూర్తి చేసిన రాజమౌళి క్లైమాక్స్ లో భారీ ఫైట్స్ ని చిత్రీకరిస్తున్నారని లీకులు అందాయి. ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ లో 40 మంది అమెరికన్ మల్ల యోధులతో చరణ్-తారక్ అరివీర భయంకర పోరాటాలు గగుర్పొడిచేలా తెరకెక్కిస్తున్నారని ఇంతకుముందే సమాచారం అందింది. ఈ ఫైట్ కొరియోగ్రఫీ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పావెల్ ని రంగంలోకి దించారని తెలిసింది.
ఈ షెడ్యూల్ తర్వాత కూడా జక్కన్న అండ్ టీమ్ కి ఏమాత్రం గ్యాప్ ఉండదని తాజాగా తెలిసింది. ఈనెల 12 నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ని రాజమౌళి అండ్ టీమ్ తెరకెక్కించనున్నారు. రామ్ చరణ్ - ఆలియా జంటపై ఈ రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారని తెలిసింది. దీనికోసం హైదరాబాద్ లో ఓ సెట్ కూడా వేశారట.
అల్లూరితో సీత రొమాన్స్ కి సంబంధించిన సాంగ్ అంటే సెట్స్ కూడా ఎంతో ట్రెడిషనల్ లుక్ తోనే ఉంటాయనడంలో సందేహమేం లేదు. ఇక చెర్రీ-ఆలియా జోడీ తెరపై ఎలా కనిపించనుందో చూడాలన్న ఆత్రం మెగాభిమానుల్లో ఉంది. మరోవైపు ఆచార్యలో తన షెడ్యూల్ ని జెట్ స్పీడ్ తో పూర్తి చేసిన చరణ్ తిరిగి ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణకు అందుబాటులోకి రావడం ఆసక్తికరం. ఈ చిత్రంలో తారక్ సరసన ఒలీవియా మోరిస్ కథానాయికగా నటిస్తోంది. అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రను పోషించారు.