వాళ్లు చేసుకోకపోయినా పెళ్లి వీళ్లు చేసేలా ఉన్నారు..!

Update: 2022-11-24 02:30 GMT
టాలీవుడ్ యంగ్ కపుల్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ రిలేషన్ కూడా కొనసాగిస్తున్నారని టాక్. మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమేనా అంటే కాదని అంటున్నారు కొందరు.

ఇద్దరు కలిసి గీతా గోవిందం సినిమాలో నటించారు. ఆ టైం లోనే ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడ్డది. గీతా గోవిందం హిట్ కొట్టగా ఈ జోడీకి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అయితే అప్పుడే కన్నడ హీరో రోహిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్మెంట్ జరుపుకుంది. కెరీర్ ఇప్పుడే మొదలు పెట్టి అప్పుడే పెళ్లేంటని కామెంట్స్ రావడంతో ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది.

రష్మిక రోహిత్ శెట్టితో పెళ్లి వద్దనుకోవడంలో కూడా విజయ్ దేవరకొండ ప్రమేయం ఉందని అప్పట్లో టాక్. గీతా గోవిందం తర్వాత డియర్ కామ్రేడ్ లో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా విజయ్, రష్మికల పెయిర్ ని ఆస్వాధించారు ప్రేక్షకులు.

ఇక తర్వాత ఎవరి సినిమాలు వారు చేస్తున్నా సరే విజయ్, రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ అన్న వార్తలు వస్తున్నాయి. లైగర్ ప్రమోషన్ లో భాగంగా కరణ్ జోహార్ షో లో కూడా విజయ్ రష్మికతో డేటింగ్ లో ఉన్నాడని హింట్ ఇచ్చింది ఆ సినిమా హీరోయిన్ అనన్యా పాండే.  

ఇక లేటెస్ట్ గా విజయ్, రష్మికల పెళ్లి అయినట్టుగా దండలతో ఫోటో ఒకటి సిద్ధం చేశారు రౌడీ ఫ్యాన్స్. ఈ ఇద్దరి మధ్య ఉన్నది లవ్వే అని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఒకరి కోసం ఒకరు ఇస్తున్న ప్రిఫరెన్స్ మాత్రం దాదాపు లవ్ కన్ఫర్మ్ అవుతుంది. ఈమధ్య మాల్దీవ్స్ కి రష్మిక ఒంటరిగా వెళ్లిందా లేక రౌడీ బోయ్ కూడా వెంట వెళ్లాడా అన్నది కూడా డౌట్ రేజ్ అవుతుంది. ఏది ఏమైనా వీళ్ల మధ్య ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇస్తే బెటర్ లేదంటే ఆడియన్స్ వీరి పెళ్లి దగ్గర ఉండి చేసేలా ఉన్నారు.

టాలీవుడ్ లో ఇలాంటి కేసు మరొకటి ఉంది. అదే ప్రభాస్ అనుష్కల జోడి ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ అవడంతో మేమిద్దరం ఫ్రెండ్స్ అని ఎంత చెప్పినా ప్రభాస్ తో అనుష్క కి లింక్ పెట్టి వార్తలు రాస్తుంటారు. ఇప్పుడు విజయ్ రష్మికల వ్యవహారం కూడా అలాగే మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News